x

16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఢిల్లీలో భారీ భద్రత ఎందుకు?

ఒకవైపు పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీల నల్ల దుస్తుల్లో నిరసన..మరోవైపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన..ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెంచేశాయి.


ఒకవైపు పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీల నల్ల దుస్తుల్లో నిరసన.. మరోవైపు...జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన.. ఢిల్లీలో దేశ రాజధానిలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెంచేశాయి. భద్రతా కారణాల వల్ల 16 మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

NEET పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వర్షాకాల సమావేశాల మూడో రోజున...ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించాయి. దీనికి సంకేతంగా...పలువురు ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

ఇటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న CJP నిరసనకు...ఎన్ సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్...ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్...శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్...రాజ్యసభ ఎంపీలు మహువా మోయిత్రా...గోపాల్ రాయ్ తదితర నేతలు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. సోమవారం విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని వారు తప్పుబట్టారు.

మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు ప్రధాని నివాసం వెలుపల ధర్నా చేపట్టారు. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. వినిపించుకోకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించి స్టేషన్‌కు తరలించి, కొన్ని గంటల తర్వాత వారిని విడుదల చేశారు.

విడుదలైన తర్వాత రాహుల్ మాట్లాడారు. విద్యార్థుల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. సోమవారం జరిగిన ఘటనకు ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే... పరీక్షా విధానంలో వెంటనే సంస్కరణలు తీసుకురావాలని కోరారు.

నిరసనల నేపథ్యంలో జాతీయ రాజధానిలో భద్రతను భారీగా పెంచారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. అదనపు పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా 16 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేశారు.

మరోవైపు సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాకు చెందిన న్యాయవాద బృందం కార్యకర్తలు న్యూయార్క్, శాన్ హోసేలలో ప్రదర్శనలు నిర్వహించారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు న్యూయార్క్ నగరంలోని యూనియన్ స్క్వేర్ సమీపంలో మహత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేశారు. అలాగే లండన్‌లోని భారత హైకమిషన్ ముందు, భారత రాయబార కార్యాలయం దగ్గర కూడా ఇలాంటి నిరసన ప్రదర్శనలే జరిగాయి.

మొత్తానికి...NEET వివాదం ఇప్పుడు వీధుల నుంచి పార్లమెంట్ వరకూ చేరుకుంది. ప్రతిపక్షాలు చర్చ కోరుతుండగా...ప్రభుత్వం శాంతిభద్రతలపై దృష్టి పెట్టింది. రాహుల్, ప్రియాంకల నిరసన...SJP ఆందోళన...భారీ భద్రత...ఈ పరిణామాలన్నీ కలిసి ఢిల్లీ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఇక బుధవారం పార్లమెంట్‌లో ఈ అంశంపై ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Read More
Next Story