
’నా కోసం ఈ రోజు పుట్టావు‘ భువనేశ్వరి ఎమోషనల్ పోస్టు
నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి చంద్రబాబు అంటూ భువనేశ్వరి పేర్కొన్నారు.
రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో నారా చంద్రబాబుకు కొండంత అండగా నిలిచిన నారా భువనేశ్వరి, తన భర్త చంద్రబాబు పుట్టినరోజున సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం శుభాకాంక్షలతో సరిపెట్టకుండా.. వారి మధ్య ఉన్న దశాబ్దాల బంధాన్ని, ఆయన ప్రజా సేవను కొనియాడుతూ ఆమె రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.
భువనేశ్వరి ఏమన్నారంటే..
’నా కోసం ఈ రోజు పుట్టావు..
కోట్లాది మంది కోసం జీవించావు..
మీలో సగమై.. మీ కృషిలో భాగమై..
నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
మీ..
భూ‘
ప్రతి పుట్టుకకు ఒక కారణం
ఈ ట్వీట్ ద్వారా చంద్రబాబు వ్యక్తిగత జీవితంలో తనకెంత ప్రాధాన్యత ఇస్తారో చెబుతూనే, ఆయన జీవితం కోట్లాది మంది ప్రజల కోసమే అంకితమని భువనేశ్వరి ఎంతో హుందాగా పేర్కొన్నారు. ’మీలో సగమై.. మీ కృషిలో భాగమై‘ అంటూ ఆమె రాసిన వాక్యాలు, చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఆమె పోషించిన అదృశ్య పాత్రను ప్రతిబింబిస్తున్నాయి. చంద్రబాబును తన మార్గదర్శిగా అభివర్ణిస్తూ ఆమె పెట్టిన ఈ పోస్ట్, నారా కుటుంబంలోని బలమైన పునాదిని మరోసారి లోకానికి చాటిచెప్పింది.
Next Story

