చంద్రబాబును మోదీ ఏమన్నారంటే..
x

చంద్రబాబును మోదీ ఏమన్నారంటే..

చంద్రబాబుకు ప్రధాని మోదీ, గవర్నర్, పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌ (X) వేదికగా స్పందించిన ప్రధాని.. చంద్రబాబును తన ఆప్తమిత్రుడు, గుడ్ ఫ్రెండ్ గా సంబోధించడం విశేషం. కష్టపడి పనిచేసే స్వభావం గల చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ ప్రశంసించారు. చంద్రబాబుకు భగవంతుడు దీర్ఘాయుష్షును, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మోదీ ఆకాంక్షించారు.


దార్శనికతను కొనియాడిన పవన్ కల్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన దార్శనికతను కొనియాడారు. ఒక స్పష్టమైన విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను చంద్రబాబు భుజానికెత్తుకున్నారని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తూ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గవర్నర్ అభినందనలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జన్మదిన అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకుంటూ, ప్రజా సేవలో నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
Read More
Next Story