విజయ్ నివాసంలో త్రిష సందడి
x

విజయ్ నివాసంలో త్రిష సందడి

శ్రీవారి ఆశీస్సులతో విజయ్‌కు అభినందనలు..తిరుమల నుంచి నేరుగా విజయ్ వద్దకు త్రిష.


దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ఈరోజు తన 43వ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె, వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా చెన్నై చేరుకున్న త్రిష, టీవీకే అధినేత విజయ్ నివాసానికి వెళ్లారు. తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ అద్భుతమైన ఆధిక్యం కనబరుస్తున్న నేపథ్యంలో ఆమె ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

సోషల్ మీడియాలో జన నాయగన్ ట్రెండింగ్
తిరుమల దర్శనం ముగించుకుని వస్తున్న సమయంలో ఓ అభిమాని మేడం ఈరోజు రిజల్ట్ మనదే అని అనగా, త్రిష చిరునవ్వుతో స్పందించడం విశేషం. ప్రస్తుతం ఎక్స్‌ (X) లో #Trisha తో పాటు విజయ్‌ను ఉద్దేశించి #JanaNayagan (ప్రజల నాయకుడు) అనే హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. విజయ్, త్రిషల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, వారిద్దరూ కలిసి నటించిన సినిమాల నేపథ్యంలో ఈ భేటీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
పొత్తుల దిశగా టీవీకే అడుగులు?
తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కి చేరువలో టీవీకే నిలిచింది. దీంతో అధికార ఏర్పాటు కోసం విజయ్‌తో కాంగ్రెస్, సీపీఐ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పీఎంకే కూడా టీవీకే వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేతో అధికారాన్ని పంచుకునేందుకు విజయ్ విముఖంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 5, పీఎంకే 6, సీపీఐ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
కీలక మలుపు .. సాయంత్రానికి స్పష్టత
తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను కాదని, ఒక కొత్త పార్టీ మ్యాజిక్ ఫిగర్ సమీపానికి రావడం చారిత్రాత్మకం. విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ఈరోజు సాయంత్రానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విజయ్ నివాసం వద్ద భారీ భద్రతతో పాటు అభిమానుల కోలాహలం నెలకొంది.
Read More
Next Story