x

నరకానికి కేరాఫ్ అడ్రస్ కడప బీసీ బాలికల హాస్టల్..

75 ఏళ్ల నాటి పాత భవనంలో భయంగా గడుపుతున్న వంద మంది బాలికలు.


కడప నగరంలోని బీసీ బాలికల హాస్టల్ నరకానికి నకలుగా మారింది. 75 సంవత్సరాల నాటి పురాతన భవనం ప్రమాదకరంగా మారింది. వంద మంది విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే వేధింపులు తప్పడం లేదనేది విద్యార్థినుల ఆరోపణ.

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే సంబరాలు నిర్వహిస్తుండగా, బీసీ హాస్టళ్లపై వైసీపీ దృష్టి సారించింది. కడప, అనంతపురం జిల్లాల్లో మాజీ మంత్రులు హాస్టళ్ల సందర్శనతో కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. హాస్టళ్లను సందర్శించిన వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు అక్కడి వాతావరణం, సమవైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తెలుగుపులి వెంకటసుబ్బమ్మ తో కలిసి కడప నగరంలోని కో ఆపరేటివ్ కాలనీలోని బాలికల బీసీ హాస్టల్ ను అంజాద్ బాషా సమస్యలు ఆలకించి, ఆందోళన వ్యక్తం చేశారు.

"హాస్టళ్లు నరకానికి నకళ్లు" అనే మాట దాదాపు రెండు దశాబ్దాల కిందట ఓ మాట వినిపించేది. దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు అనేక మార్పులు తెచ్చింది. సంస్కరణలు అమలు చేసింది. కానీ, కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని బిసి బాలికల బీసీ బాలికల హాస్టల్ శాపగ్రస్తంగానే మాగిలింది. వంద మంది బాలికలు ఉన్నఈ హాస్టల్ గదులు మురికిగానే కాదు. వర్ణించడానికి కూడా సాధ్యం కాని విధంగా మారింది.

"పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో తెలియదు. ఓ విద్యార్థిని గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటోంది" అని కొందరు బాలికలు చెప్పారు.
కడప నగరంలోని పరిస్థితిని పరిశీలించిన వైసీపీ డిప్యూటీ మాజీ సీఎం ఎస్బీ. అంజాద్ బాషా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకటసుబ్బమ్మ ఆందోళన చెందారు.
"వంద మంది ఆడపిల్లలు ఉన్న ఈ హాస్టలో నాలుగు మరుగుదొడ్లు. పెచ్చులు ఊడే ఈ భవనంపై అధికారులు పట్టింకోరా" అని వైసీపీ డిప్యూటీ మాజీ సీఎం ఎస్బీ. అంజాద్ బాషా ప్రశ్నించారు.
ఎప్పుడు నిర్మించారు?

కడప నగరంలోని ఈ బాలికల వసతి గృహం భవనాన్ని 1950 నాటి భవనం కావడం కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో విద్యార్థినులు అభద్రత మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతమంది విద్యార్థినులు ఉంటే, కనీసం సరైన మరుగుదొడ్లు, స్నానపు గదులు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని తెలుగుపులి వెంకటసుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. భవనం పైకప్పు నుంచి పెచ్చులూడి పడడంతో గాయపడిన ఓ విద్యార్థిని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నదని తెలుసుకుని వైసీపీ నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్యలు ఇలా ఉన్నాయి..


1. ప్రమాదకర కరెంట్ వైరింగ్: పాతకాలపు వైరింగ్ వల్ల వర్షాకాలంలో స్విచ్‌లు వేస్తే షాక్ కొడుతోంది. చదువుకోవడానికి సరైన లైటింగ్ కూడా లేదు.

2. అతి నికృష్టంగా భోజనం: అక్కడ వండిన పులగం అన్నంలోకి గంట కూడా దూరనంత గట్టిగా ఉంది.
3. రక్షణ లేని వాష్‌రూమ్‌లు: 100 మందికి నాలుగే వాష్‌రూమ్‌లు, అవి కూడా రేకులు ఊడిపోయి చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల మధ్య ఓపెన్ స్పేస్‌లో ఉన్నాయి.

బీసీ భవన్ లోకి మార్పిస్తాం..బాలికల హాస్టల్ స్థితిగతులపై డిప్యూటీ మాజీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ భవనంలో పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

​"గతంలో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి నిధులతో నిర్మించిన బీసీ భవన్ సిద్ధంగా ఉంది. ఇక్కడి విద్యార్థినులను ఆ బీసీ భవన్‌కు షిఫ్ట్ చేయాలని కలెక్టర్ ను కలిసి విన్నవిస్తాం. గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించడంతో పాటు విద్యార్థినులను వేధిస్తున్న వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం​" అని అంజాద్ బాషా చెప్పారు.

Read More
Next Story