
రేవంత్ గారు, మా ఇంట్లో ప్రెస్ మీట్ కైనా పర్మిషన్ ఇస్తారా?
రచ్చకెక్కిన పవన్ కళ్యాణ్ 'పొలిటికల్' సెటైర్!
తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ వేళ హైదరాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వేసిన పదునైన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గచ్చిబౌలిలో తలపెట్టిన జనసేన సభకు పోలీసులు బ్రేకులు వేయడంతో, పవన్ కళ్యాణ్ తన రూట్ మార్చారు. "సభకు ఇవ్వకపోతే పోయారు.. కనీసం నా సొంత ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికైనా మీ పోలీసులు పర్మిషన్ ఇస్తారా రేవంత్ గారు?" అనే రేంజ్‌లో 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన సంధించిన అస్త్రం పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనం సృష్టిస్తోంది.
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం… pic.twitter.com/820J9VMCSL
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2026
అసలు ఏం జరిగింది?
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఈరోజు (మంగళవారం) ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ పేరిట జనసేన ఒక భారీ కేడర్ మీటింగ్‌ను ప్లాన్ చేసింది. దాదాపు 20 వేల మందితో నిర్వహించాలనుకున్న ఈ సభకు సైబరాబాద్ పోలీసులు నిన్న (సోమవారం) సాయంత్రం హఠాత్తుగా నోటీసులు ఇస్తూ అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు సాకు చూపడంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పవన్ 'ఎక్స్' పోస్ట్.. సెటైర్ల డోస్!
సభకు పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు. జూబ్లీహిల్స్/మాదాపూర్‌లోని తన నివాసంలోనే నేడు సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల మధ్య 'ప్రెస్ మీట్' నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా ఉంది.
"ఈ రోజు సాయంత్రం నా నివాసంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించబోతున్నాను. కనీసం జనసేన పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడానికి అయినా తెలంగాణ పోలీసు శాఖ నాకు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం..." అంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
జనసేన ఊపిరి పోసుకున్నది ఇక్కడే!
ఈ వివాదం నడుస్తుండగానే, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నేలతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు.
"జనసేన పార్టీ ఊపిరిలూదుకున్నది, పోరాట పటిమను పుణికిపుచ్చుకున్నది ఈ తెలంగాణ గడ్డపైనే."
"అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణకు ఉంది. ఆ లక్షణమే నా జనసేన శ్రేణుల్లోనూ ఉంది" అంటూ పరోక్షంగా తన సభను అడ్డుకున్న వారిపై పవన్ విమర్శలు గుప్పించారు.
సాయంత్రం ఏం జరగబోతోంది?
సభను అడ్డుకున్నా ప్రెస్ మీట్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి బాణాలు వేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకపక్క ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూనే, తెలంగాణలో జనసేన ఉనికిని చాటడానికి పవన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ప్రెస్ మీట్‌కైనా పోలీసులు ప్రశాంతంగా అనుమతిస్తారా? లేక అక్కడ కూడా ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Next Story

