దక్షిణాది రాష్ట్రాలకు జనసేన పార్టీని విస్తరించడానికి శ్రీకారం చుట్టారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఆదివారం జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు స్థానిక నాయకులతో భేటీ అయ్యారు. సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు.
కేరళలో రానున్న కాలంలో జనసేన ( Jana Sena ) పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు చేపట్టే అంశాల పైన అక్కడి నేతలతో నాగబాబు మనోభావాలను పంచుకున్నారు. జనసేన మరో ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, యువజన విభాగం నేత గోకుల రవీందర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఇన్చార్జి మాధవరెడ్డి తో కలిసి కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో సభ్యత్వ నమోదు ప్రారంభించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుంచి కె. డాన్సీలన్, పి. రామసాగర్, త్రివేండ్రం నియోజకవర్గం నుంచి ఎస్.కె. దిలీప్ కుమార్, కాలికట్ నియోజకవర్గం నుంచి జోషి అధోలి, బిజు కె మావూర్, ఎం.కె. అంబేద్కర్ (కొచ్చి), టోమ్ వర్గీస్ ( త్రిశూర్ ) కె, టెస్సీ థామస్, మోహన్దాస్, ఫణికేర్, ఎం. సునీల్ కుమార్, మహ్మద్ రైసుద్దీన్, కె.ఎం. ఆడమ్ మాలిక్, కె. శ్రీజ ( మలప్పురం ), అనిల్ ఎస్ నాయర్ ( మలప్పురం), సౌమ్య ఉన్ని కృష్ణన్ (ఎర్నాకులం ) వంటి ప్రజాదరణ కలిగిన నేతలు చేరారని జనసేన నేతలు వెల్లడించారు.
"జనసేన చీఫ్, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సభ్యత్వ నమోదు భారీగా ప్రణాళిక సిద్ధం చేశాం" అని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి ప్రస్ధానం..
తెలంగాణలో ఊపిరి పోసుకున్న ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆయన రెండో అన్న నాగబాబు ఓటమి చెందారు. జనసేన అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి వరప్రసాదరావు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి అనుకూలంగా మారిపోయారు.
2024 రాష్ట్ర రాజకీయ పరిస్థితి మలుపు తిప్పాయి. టిడిపి కూటమిలో భాగస్వామిగా మారిన జనసేన ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసి, 100% స్ట్రైక్ రేట్ సాధించింది. తద్వారా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచే బిజెపితో సఖ్యతగా పవన్ కళ్యాణ్ బిజెపితో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఏర్పరుచుకున్న సన్నిహిత సంబంధాలే కూటమి ఏర్పాటులో కీలకంగా పనిచేశాయి.
పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం..
ఆంధ్ర తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీలో తెలుగు వారు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేసి, ఎన్డీఏ కూటమి మైత్రిని మరింత బలోపేతం చేసుకున్నారు. అందుకు ప్రధానంగా పొరుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సీట్లలో ఎన్డీఏ పార్టీల అభ్యర్థులు ప్రధానంగా బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయం సాధించారు. ఈ విజయాల పరంపర పవన్ కళ్యాణ్ ఇమేజ్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం, స్టార్ క్యాంపెయినర్ గా పవన్ కల్యాణ్ ను బిజెపి ఎంచుకుంది. ఈ ఉత్సాహం, బీజేపీ ప్రోత్సాహం వల్లే..
దక్షిణాదిలో విస్తరణకు
తెలంగాణలో ఊపిరి పోసుకున్న జనసేన పార్టీని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సాగించిన పోరాటాలు రాజకీయంగా ప్రధాన చర్చకు తెర తీశాయి. సినిమా కథా నాయకుడుగా ఇమేజ్, వెండి తెరపై కొణిదల చిరంజీవికి ఉన్న స్టార్ డం అనుకూలంగా మార్చుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. ఆ మేరకే కేరళలో బలంగా ఉన్న సినీ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు పార్టీ నేతలను పవన్ కల్యాణ్ రంగంలోకి దించారు.
"పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ ఆదేశాలతోనే కేరళలో యూనిట్ ప్రారంభానికి నాంది పలికాం" అని నాగబాబు ప్రకటించారు
"పవన్ కళ్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతం. దేశంలో ప్రజలను ఆకట్టుకుంటోంది. దక్షిణాదిలోని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్ధనలు వస్తున్నాయి అని తాళ్లూరి రామ్" స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, జనసేన పార్టీ విస్తరణకు ప్రయత్నాలు చేపడతామని వెల్లడించారు.
స్టార్ డమ్...
దక్షిణాది రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత కేరళలో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్న చిరంజీవి, ఈయన బామ్మర్ది అల్లు అరవింద్ కొడుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయంగా కూడా మంచి గుర్తింపు లభించిన నేపథ్యంలో పార్టీ వైపు ఇమ్మడుచుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది.
" పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల నేపథ్యంలోనే కేరళలో పార్టీ యూనిట్ ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించాం" అని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కానే కాకుండా పవన్ కళ్యాణ్ కు స్వయాన రెండో అన్న కొణిదెల నాగబాబు మీడియాకు స్పష్టం చేశారు.
కేరళలో పవన్ కళ్యాణ్ కు ఉన్న సినిమా ఫాలోయింగ్ రాజకీయంగా కూడా అనుకూలంగా మారుతుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు.
"కేరళ రాజకీయాలు ఏపీకి భిన్నంగా ఉన్నప్పటికీ పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది" అని నాగబాబు స్పష్టం చేశారు.
కండువాలతో పార్టీలోకి ఆహ్వానం..
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జనసేన నిర్వహించిన మొదటి సమావేశానికే మంచి ఆదరణ లభించినట్లు అక్కడి వాతావారణం స్పష్టం చేస్తోంది. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులకు జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కండువాలు వేసి ఆహ్వానించారు.
స్థానిక నాయకులు వారికి సహకారం అందించడంతో..
"నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోకదళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు" అని నాగబాబు ప్రకటించారు. రాజకీయంగా ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేది కొన్ని నెలల తరువాత ఆ ప్రభావం కనిపిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.