తమిళనాడు 2026 ఫలితాల గురించి బీజేపీ అన్నామలై ముందుగానే ఎలా తెలుసు?
x

తమిళనాడు 2026 ఫలితాల గురించి బీజేపీ అన్నామలై ముందుగానే ఎలా తెలుసు?

2024లో ఆయన చెప్పిన హంగ్ జోస్యం నేడు అక్షరాలా నిజమవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.


ఐదు దశాబ్దాల ద్రావిడ ఆధిపత్యానికి బ్రేక్.. సరికొత్త రాజకీయ శకానికి నాంది నాంది పలుకుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక పెను సంచలనాన్ని నమోదు చేయగా, ఈ మార్పును రెండేళ్ల క్రితమే పసిగట్టిన బీజేపీ అగ్రనేత కే. అన్నామలై ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. నాడు 2024లో ఆయన చెప్పిన హంగ్ జోస్యం నేడు అక్షరాలా నిజమవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. తమిళనాడులో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని రోజు రాబోతోంది.. సరికొత్త స్వచ్ఛమైన కూటమి పాలన వస్తుంది అని ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు, నేటి ఫలితాల్లో అక్షర సత్యాలుగా నిలిచాయి. దశాబ్దాల తరబడి డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయాలు, అన్నామలై ఊహించినట్లుగానే ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగాయి. అసలు ఆనాడే ఆయన ఈ రాజకీయ భూకంపాన్ని ఎలా పసిగట్టారు? అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మిస్టరీ.

దశాబ్దాల ఆధిపత్యానికి గండి..అన్నామలై అంచనా నిజం
అన్నామలై రెండేళ్ల క్రితం ఏ ధీమాతో అయితే చెప్పారో, నేటి ఫలితాలు అక్షరాలా అదే దిశగా సాగాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోవడం గమనార్హం. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి కాలం చెల్లిందని, తమిళ ఓటర్లు ఒక స్వచ్ఛమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం పరితపిస్తున్నారని ఆయన నాడు చేసిన విశ్లేషణ నేడు అక్షర సత్యమైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సాధించిన గణనీయమైన ఫలితాలు, అన్నామలై అంచనా వేసిన ఆ 'కొత్త మార్పు'కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.
క్లిష్టమైన రాజకీయ సమీకరణాలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వైరల్ అవుతున్న అన్నామలై పాత వీడియో, ఆయన రాజకీయ దార్శనికతకు అద్దం పడుతోంది. ఆయన నాడు కేవలం ఒక జోస్యం చెప్పి వదిలేయలేదు. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన సంప్రదాయ కూటములు విచ్ఛిన్నమవుతాయని, కొత్త సమీకరణలు పుట్టుకొస్తాయని చాలా స్పష్టంగా వివరించారు. ఒక జాతీయ పార్టీ నేతగా ఉండి, పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే పెనుమార్పులను, ప్రజల అంతరంగాన్ని ఆయన అంత కచ్చితంగా ఎలా పసిగట్టారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన చూపిన చాకచక్యం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
రాజకీయ సిద్ధాంతిగా అన్నామలై .. వినూత్న కూటమి ఆవిర్భావం
నేడు తమిళనాట చోటుచేసుకుంటున్న పరిణామాలు అన్నామలై విశ్లేషణను వంద శాతం నిజం చేశాయి. ముఖ్యంగా, దశాబ్దాల కాలంగా డీఎంకేతో విడదీయలేని బంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ, అనూహ్యంగా ఆ బంధాన్ని తెంచుకుని టీవీకేకు మద్దతు ఇవ్వడం ఒక చారిత్రక మలుపు. ఈ వినూత్న కూటమి ఆవిర్భావం అన్నామలై రెండేళ్ల క్రితమే ఊహించిన రాజకీయ భూకంపం'లో భాగమే. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, నేటి తమిళ రాజకీయ సంక్షోభం, మారుతున్న సమీకరణల నేపథ్యంలో అన్నామలై ఒక రాజకీయ సిద్ధాంతిగా తనను తాను నిరూపించుకున్నట్లయింది.
విజయ్ ప్రభంజనం.. మారిన రాజకీయ సమీకరణాలు
తమిళనాడు రాజకీయ యవనికపై నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఒక చారిత్రక ప్రభంజనాన్ని సృష్టించింది. తన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించడం ద్వారా ద్రావిడ రాజకీయాల ముఖచిత్రాన్ని విజయ్ మార్చేశారు. అయితే, అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం పది అడుగుల దూరంలో ఆయన నిలిచిపోవడం ఇప్పుడు తమిళనాట ఉత్కంఠను పెంచుతోంది. సరిగ్గా ఈ హంగ్ వాతావరణంలోనే అన్నామలై రెండేళ్ల క్రితం ఊహించిన కొత్త కూటమి ఊపిరి పోసుకుంది. దశాబ్దాల కాలంగా డీఎంకేతో విడదీయలేని బంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ (5 సీట్లు), అనూహ్యంగా ఆ కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించడం తమిళ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది.
అన్నామలై 2024లోనే ఈ రాజకీయ భూకంపాన్ని ఎలా పసిగట్టారనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. పాత రాజకీయ బంధాలు ముక్కలవుతాయని, సరికొత్త శక్తులు ఏకమవుతాయని ఆయన నాడు చేసిన హెచ్చరికలు నేడు అక్షరాలా కళ్లముందు కనిపిస్తున్నాయి. డీఎంకే కోటను బద్ధలు కొట్టడమే కాకుండా, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ తన మిత్రపక్షాన్ని వీడి కొత్త శక్తితో చేతులు కలపడం అనేది అన్నామలై క్షేత్రస్థాయి పరిశీలనకు నిదర్శనం. రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు ఒక 'స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం' వస్తుందని ఆయన నాడు పదేపదే చెప్పారు. నేడు విజయ్ రూపంలో ఆ మార్పు రావడం, దానికి పాత కూటముల విచ్ఛిన్నం తోడవ్వడం అన్నామలై అంచనాలను వంద శాతం నిజం చేసింది.
లోక్‌భవన్‌లో హైడ్రామా.. అన్నామలై ఊహించిన హంగ్ ఉచ్చు
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అంతుచిక్కని మలుపు తిరిగాయి. 2024లోనే కే. అన్నామలై జోస్యం చెప్పినట్లుగా.. ఏ ఒక్క పార్టీకీ మెజార్టీ దక్కకపోవడంతో హంగ్ నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ, ఫలితం ఆశించినట్లుగా లేదు. మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 మంది సభ్యుల మద్దతును స్పష్టంగా నిరూపించిన తర్వాతే రావాలి" అని గవర్నర్ తేల్చి చెప్పడం, ఈ రాజకీయ ప్రతిష్టంభనను మరింత జటిలం చేసింది. నాడు అన్నామలై ఊహించినట్లే, 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్.. అధికారం చేపట్టేందుకు ఆఖరి 10 అడుగుల దూరంలో (మ్యాజిక్ ఫిగర్ కోసం) శ్రమించాల్సి రావడం గమనార్హం.
విడదీయలేని చిక్కుముడి.. కొత్త కూటమి దిశగా అడుగులు
సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో ఇప్పుడు అందరి కళ్లు చిన్న పార్టీలపై పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించగా, ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ పార్టీలు కూడా సానుకూలత వ్యక్తం చేసినా అధికారికంగా లేఖలు ఇవ్వలేదు. అన్నామలై రెండేళ్ల క్రితమే వివరించిన "సరికొత్త కూటమి" ఆవిర్భవించడానికి ఇదే కీలక సమయం. దశాబ్దాల మిత్రులను వదిలి కాంగ్రెస్ వంటి పార్టీలు కొత్త శక్తులతో చేతులు కలపడం అన్నామలై దార్శనికతకు నిదర్శనం. అయితే, రాజ్యాంగపరమైన నిబంధనల ప్రకారం మెజార్టీ నిరూపించుకునే వరకు విజయ్‌ను వేచి చూడాలని గవర్నర్ కోరడం, తమిళనాట ఒక అసాధారణ రాజకీయ ఉత్కంఠకు తెరలేపింది. ద్రావిడ కోటలో ఈ కొత్త సమీకరణలు చివరకు ఎటు దారితీస్తాయనేది ఇప్పుడు దేశవ్యాప్త చర్చనీయాంశమైంది.
ముందస్తు వ్యూహమా? లేక క్షేత్రస్థాయి పరిశీలననా?
అన్నామలైకి ఈ పరిణామాలు ముందే ఎలా తెలుసు? అనే సమాధానం దొరకని ప్రశ్న సంచలనం రేపుతున్న తరుణంలో ఆయన ఉన్నత విద్యావంతుడు కావడంతో తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల నాడిని, మారుతున్న యువత ఆలోచనలను లోతుగా విశ్లేషించి ఇలా జోస్యం చెప్పి ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ద్రావిడ పార్టీలపై ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన ఆయన, 2024లోనే బీజేపీ ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.. సంప్రదాయ కూటములను బలహీనపరిచి, కొత్త శక్తులు (విజయ్ వంటి వారు) వచ్చేలా మార్గం సుగమం చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, ఇది కేవలం జోస్యం మాత్రమే కాదు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, మోదీల మార్గదర్శకత్వంలో రచించిన దీర్ఘకాలిక వ్యూహం (Long-term Strategy) కూడా అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా వినిపిస్తోంది.
మరోవైపు, బీజేపీ కేంద్ర నాయకత్వం తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించిందని, అక్కడ ద్రావిడ పార్టీల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడానికి మూడో శక్తి (Third Force) ఆవిర్భావం అత్యవసరమని వారు భావించినట్లుగా కూడా వాదన వినిపిస్తోంది. అందుకే, అన్నామలై ద్వారా అప్పట్లోనే ఇలాంటి సంకేతాలు ఇప్పించారని కొందరి వాదన. 2024లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం పెరగడం, విజయ్ వంటి కొత్త తరం నాయకులు రంగంలోకి రావడం ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

Read More
Next Story