కాంగ్రెస్–టీవీకే పొత్తుపై కనిమొళి ఏమన్నారు?
x

కాంగ్రెస్–టీవీకే పొత్తుపై కనిమొళి ఏమన్నారు?

డీఎంకే ఓటమి, విజయ్ గెలుపుపై తూత్తుకుడి ఎంపీ స్పందనేమిటి?


Click the Play button to hear this message in audio format

తమిళనాడు రాజకీయాల్లో పొత్తుల చర్చలు ఊపందుకున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో కాంగ్రెస్ చేతులు కలిపిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ పొత్తుపై డీఎంకే నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వస్తున్నా, ఆ పార్టీ ఎంపీ కనిమొళి మాత్రం కూల్‌గా స్పందించారు.

‘‘ప్రతి పార్టీకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయాలు సహజమే అంటూనే భవిష్యత్తులో కూడా తమ పార్టీ రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తుంది’’ అని స్పష్టం చేశారు. టీవీకే లాంటి మరో లౌకిక పార్టీ రాజకీయాల్లోకి రావడం పట్ల తమకు ఎలాంటి ఆందోళన చెందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో లౌకిక పార్టీల ఆవిర్భావం ప్రజాస్వామ్యానికి మంచిదని అభిప్రాయపడ్డారు. 234 అసెంబ్లీ స్థానాల్లో 59 స్థానాలు మాత్రమే గెలుచుకున్న డీఎంకే, తన పనితీరును సమీక్షించుకుంటుందని కనిమొళి చెప్పారు. తమ పార్టీ గతంలో అనేక విజయాలు, ఓటములను చవిచూసిందని, వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు.

‘ప్రజలు మార్పు కోరుకున్నారు..’

తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని కనిమొళి అంగీకరించారు. ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, అది రాజకీయాల్లో సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విజయ్‌కి కనిమొళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న పాలనను అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తం మీద, కాంగ్రెస్–టీవీకే పొత్తుపై చర్చలు కొనసాగుతున్నా, డీఎంకే మాత్రం దీనిని సహజ రాజకీయ పరిణామంగా చూస్తూ, తన వ్యూహాత్మక స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నట్లు కనిమొళి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Read More
Next Story