
డీలిమిటేషన్ బిల్లు: ఆత్మరక్షణలో పడిన వైసీపీ.. ఎంపీ మాటలే సాక్ష్యం..
వ్రతం చెడినా జగన్ కు ఫలితం దక్కిందా? విశ్లేషకులు ఏమంటున్నారు...
డీలిమిటేషన్ బిల్లు వైసీపీకి సెల్ఫ్ గోల్ అయిందా? రాజకీయంగా ఆ పార్టీకి మేలు జరిగిందా? అనేది చర్చగా మారింది. రాజకీయ ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించుకున్నా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాటలు మాత్రం ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి.
"ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రత్యేక హోదా (Special Category Status) ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మౌఖిక హామీ ఇచ్చారు. అది చట్టంలో లేదు. ఆ సాకుతో ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఆ చేదు అనుభవం దృష్ట్యా, డీలిమిటేషన్ విషయంలో కూడా మౌఖిక హామీలను నమ్మలేం., చట్టబద్ధమైన గ్యారెంటీ ఉండాలి" అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరడం ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. చట్టం చేయడానికి తయారు చేసిన బిల్లులో 50 శాతం సీట్ల సంఖ్య నమోదు చేయలేదని తెలిసీ, ఎందుకు మద్దతు ఇచ్చారనేది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం వల్ల వైసీపీకి ప్రమాదం తప్పింది. వైఎస్. జగన్ వ్యవహార సరళి ప్రధాని మోదీతో సఖ్యత మరింత పెరిగేలా చేసుకున్నారు. అనడంలో సందేహం లేదు.
డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే విషయంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఒక తీరు, జాతీయ అంశాలపై వైఎస్. జగన్ ద్వంద విధానాలు కనిపిస్తాయి. ఇక్కడ రెండు అంశాలు పరిశీలిస్తే, ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
"డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా జాతీయవాదం. మహిళల ఆదరణ పెంచుకోవాలనే కోణం. రాష్ట్రాల హక్కుల కోసం Neet పరీక్ష రద్దు చేయాలనే డీఎంకే నినాదంతో గొంతు కలపడం. రాజధాని అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసిపి తీరు" ఇందుకు నిదర్శనం అనేది రాజకీయ విశ్లేషకుల మాట.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ఆందోళనను వైసీపీ పెడచెవిన పెట్టింది. అమరావతి రాజధాని బిల్లు తరహాలోనే డీలిమిటేషన్ లో కూడా వైసీపీ వ్యవహరించడానికి ఆస్కారం ఉన్నా, ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం ద్వారా దక్షిణాదిలో ఆంధ్రా నేతలు అంటే ప్రత్యేకంగా చూసే పరిస్థితి కల్పించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై పీసీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డి ఘాటుగానే స్పందించారు.
"రాజ్యాంగాన్ని దెబ్బతీసే బిల్లుకు వంతపాడడం ద్వారా జగనన్న బీజేపీ దత్తపుత్రుడు" అని మరోసారి తేలిపోయిందని షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఆశయాలు, వారసత్వం ముందుకు తీసుకుని వెళడం అంటే ఇదేనా? అని కూడా సొంత అన్న జగన్ ను షర్మిలారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
"డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం కాదు. రాజ్యాంగ విలువలు గెలిచాయి" ఏ సాధించారని ప్రతిపక్షాలను ప్రశ్నించడం సిగ్గుమాలిన చర్య అని షర్మిలా రెడ్డి అన్నారు.
వైసీపీ వ్యూహం ఫలించిందా?
బిజెపితో సత్సంబంధాలు నెరపడానికి జాతీయవాద స్వరం వినిపించారు. తద్వారా మహిళా ఓటర్ల అభిమానం చూడగణాలనేది ఒక ఎత్తు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పెరుగుతుంది. ఇమడచవచ్చు అనేది వైసిపి వ్యూహం. పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం కూడా వైసీపీకి అనుకూలించిన అంశం గానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఒకవేళ డీలిమిటేషన్ జరిగి ఉంటే, ఏపీలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మండలాలను విడగొట్టడం ద్వారా ఆస్కారం ఉండేది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందని తమ పార్టీకి మేలు జరిగిందని ఆ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు బిల్లు ఓటింగ్ కు రాకముందే ఎన్డీఏ, వైసీపీ తీరును ఎండగట్టారు.
"ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టంపై మళ్లీ బిల్లు ఏమిటి? డీలిమిటేషన్ కు ముడిపెట్టిన విధానంపై
వైసీపీ, టీడీపీ మౌనం ప్రమాదకరం" అని కూడా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, దక్షిణాది రాష్ట్రాల బలం తగ్గే ప్రమాదం ఉన్నా, రెండు పార్టీలు కేంద్రానికి వంత పాడిన తీరుతో ప్రజలకు ద్రోహం చేశాయి" అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఒక అంశంపై ఒకో విధానం..
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ బలమైన స్వరాన్ని వినిపించి, ఏకతాటి పైకి తీసుకురావడంలో సఫలమైన విషయం బయటపడింది.
2024 మార్చి 12 : డీలిమిటేషన్కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల పార్టీ నాయకుల మద్దతు సమీకరించడానికి చెన్నైలో డీఎంకే 22వ తేదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైసిపి చీఫ్, ఆనాటి సీఎం వైఎస్. జగన్ ను తమిళనాడు సీఎం ఏం కే స్టాలిన్ దూతలుగా వచ్చిన డీఎంకే మంత్రి ఈవి. వేలు, రాజ్యసభ సభ్యుడు పీ విల్సన్ ఆహ్వానం పలికారు.
వైసిపి స్పందన: ఈ చెన్నైలో జరిగిన సమావేశానికి వైసీపీ హాజరు కాకుండా తటస్థంగా వ్యవహరించింది. కేరళ సీఎం వినయ్ విజయంతో పాటు తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా హాజరయ్యారు.
2022 జనవరి 8: నీట్ (NEET) రద్దు చేయాలని డీఎంకే డిమాండ్ చేసింది. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలని డిఎంకె డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి ఆహ్వానం అందుకున్న వైసిపి నుంచి ఆ పార్టీ ప్రతినిధిగా వీ. విజయసాయిరెడ్డిని జగన్ పంపించారు.
"విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉండడంవల్ల రాష్ట్రాలకు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే హక్కు ఉండాలని వైసిపి కూడా బలంగా వాదన వినిపించింది"
2026 ఏప్రిల్ 16: మహిళా రిజర్వేషన్ కు ముడిపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వైసిపి ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది.
రాష్ట్రంలో టీడీపీ కూటమితో వైసీపీ తీవ్ర స్ధాయిలో ఘర్షణాత్మక ధోరణితో సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం, బలమైన భాగస్వామిగా ఉన్నారు. విబేధాలు పక్కకు ఉంచిన వైసీపీ చీఫ్ జగన్ ఏకపక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ,
వైఎస్. జగన్ కు స్వయానా చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డి మాత్రం...
"వైసీపీ అధికారంలో ఉండగా, చేసిన అవినీతి నుంచి బయటపడడానికే బీజేపీతో అంటకాగారు." అని షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును
డీలిమిటేషన్ కు లింకు పెట్టి మాట్లాడడం జగనన్న అవివేకానాకి నిదర్శనం అని కూడా ఎద్దేవా చేశారు.
మేలు.. జరిగిందిలే..
పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం కూడా వైసీపీకి అనుకూలంగా మారినట్లే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి ఉంటే, వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మండలాలను విడగొట్టడం ద్వారా దెబ్బతీసే ప్రమాదం నుంచి బయటపడినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలపై పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి ఘాటుగా స్పందించారు.
"మా జగనన్న బిజెపితో పెట్టుకున్న అక్రమ పొత్తు కూడా బయటపడింది. కేసుల నుంచి రక్షణ కోసమే ప్రధాని మోదీకి బానిసలా బతుకుతున్నారు" అని సొంత అన్న వైఎస్. జగన్ పై షర్మిల రెడ్డి విరుచుకుపడ్డారు.
వైసీపీకి ఓ విధానం అంటూ లేకుండా పోయిందని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విమర్శించారు
" టీడీపీ కూటమి కౌగిలిలో జగన్ కూడా ఒదిగిపోయినట్లు ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వార్థం ఎక్కువగా పనిచేసింది. వెరసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారు" అని సీపీఎం నేత నాగరాజు వ్యాఖ్యానించారు. మహిళాబిల్లుకు డీలిమిటేషన్ ముడిపెట్టడం అత్యంత ప్రమాదకరం అని తెలిసినా మద్దతు ఇవ్వడం అనేది ఆత్మహత్యా సదృశ్యంగా నాగరాజు అభివర్ణించారు.
రెండు విధాలా లాభించింది..
వైసీపీకి రెండు విధాలుగా లాభం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లుకు మద్దతు ఇవ్వడం అనేది ప్రధాని మోదీ మెప్పు పొందడానికి అవకాశం కల్పించింది. ఓటింగ్ లో కూడా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశాయని చెప్పకతప్పదు. బిల్లులో 50 శాతం పొందుపరచలేదని తెలిసినా? ఎందుకు మద్దతు ఇచ్చారనేది ఆ పార్టీ నేతలు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారనేది పక్కకు ఉంచితే, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాట ఆంధ్రులకు ఓ చిలిపి పేరు ఉండేది.
"ఆంధ్రా.. బాంద్ర" అంటే తెలుగోళ్లు కోతులు అని సంబోధించే వారు. ఈ మాటను వైసీపీ ఎంపీ మిథున్ నిజం చేస్తారా?
పార్లమెంటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నమాటలు ఇవి.
"గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రత్యేక హోదా (Special Category Status) ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మౌఖిక హామీ ఇచ్చారు. అది చట్టంలో లేదనే సాకుతో నేటికీ అమలు చేయడం లేదు. ఆ చేదు అనుభవం దృష్ట్యా, డీలిమిటేషన్ విషయంలో కూడా మౌఖిక హామీలను నమ్మలేమని, చట్టబద్ధమైన గ్యారెంటీ ఉండాలి" అని కోరారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా "ఏ రాష్ట్రానికి సీట్ల సంఖ్య తగ్గదు. జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి" అనే మాటలు మినహా, బిల్లులో లేదని వైసీపీ తెలుసు. ఆ హామీ మాటలు కాకుండా, బిల్లులో చేర్చాలని ఓటింగ్ కు మందు ఎంపీ మిథున్ రెడ్డి కోరడం కూడా వైసీపీ రాజకీయంగా విమర్శలకు గురైంది.
Next Story

