
లోక్‌సభలో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు
బీజేపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2/3 మెజారిటీ మిస్.. 48 ఓట్ల తేడాతో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లులపై లోక్‌సభలో శుక్రవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. చర్చ అనంతరం హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తూ.. ఈ బిల్లులు దేశ భవిష్యత్తును మారుస్తాయని భరోసా ఇచ్చినప్పటికీ, తుది ఓటింగ్‌లో ప్రభుత్వానికి అవసరమైన 'ప్రత్యేక మెజారిటీ' (Special Majority) లభించకపోవడంతో 'రాజ్యాంగ సవరణ బిల్లు' వీగిపోయింది.
బిల్లుల రకాలు - మెజారిటీ లెక్కలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు రెండు వేర్వేరు రకాల మెజారిటీలు అవసరం. ఓటింగ్ సమయంలో జరిగిన సమీకరణాలు ఇలా ఉన్నాయి.
ఎందుకు వీగిపోయింది?
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఆర్టికల్ 368 ప్రకారం రెండు నిబంధనలు పాటించాలి.
సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింటి రెండు వంతుల మెజారిటీ రావాలి. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల (2/3rd) మెజారిటీ ఉండాలి. నేటి ఓటింగ్ లెక్క ఇదీ.
మొత్తం పాల్గొన్న సభ్యులు: 489
బిల్లు నెగ్గడానికి కావాల్సిన ఓట్లు (2/3 వంతు): 326 ఓట్లు
ప్రభుత్వానికి వచ్చిన ఓట్లు: 278
తక్కువైన ఓట్లు: 48
ప్రభుత్వానికి 278 ఓట్లు రావడంతో సాధారణ మెజారిటీ (245 కంటే ఎక్కువ) లభించింది కానీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన 326 మార్కును అందుకోలేకపోయింది. దీనివల్ల 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఓటింగ్ ప్రక్రియ రాత్రి 7:21 గంటలకు ప్రారంభమై సుదీర్ఘంగా సాగింది. విపక్షాలు ఐక్యంగా ఉండి ఓటింగ్ చేయడంతో ప్రభుత్వం ఆశించిన 2/3 మెజారిటీ సాధ్యపడలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో, మిగిలిన రెండు బిల్లులకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, అవి అమల్లోకి రావడం కష్టతరంగా మారింది. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఆ బిల్లే వీగిపోవడంతో మొత్తం ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది.
Next Story

