బీజేపీ పిడుగుతో కూటమి లెక్కలు తారుమారు..
x

బీజేపీ 'పిడుగు'తో కూటమి లెక్కలు తారుమారు..

ఏపీ రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు డైలమా!


ఏపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంలో బీజేపీ ప్రతిపాదిస్తున్న తమిళనాడు నేత ఎవరన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అణ్ణామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికలోనూ అణ్ణామలై పేరు ఊహాగానాలకు తెరలేపింది. అయితే అప్పుడు బీజేపీ స్థానిక నేత పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసింది. ఇప్పుడు మళ్లీ అణ్ణామలై పేరు తెరపైకి రావడంతో బీజేపీ తమిళనాడు ఎన్నికల దృష్టితో ఆయన్ను రాజ్యసభకు పంపి, జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలని భావిస్తున్నట్టు టాక్. అన్నమలై ఐపీఎస్ నేపథ్యం, యువ నాయకత్వం బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘‘మా సీట్లు మా చేతుల్లో ఉండాలి.. బయటి రాష్ట్ర నేతలకు ఎందుకు?’’ అన్న చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను నామినేట్ చేసే సంప్రదాయం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీల హయాంలోనూ కొనసాగింది. కాంగ్రెస్ పాలనలో కర్ణాటకకు చెందిన జైరాం రమేష్‌ను 2004, 2010లో రెండు సార్లు రాజ్యసభకు పంపగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రషిద్ అల్వీని 2004-2012 మధ్య నామినేట్ చేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఏర్పాటు వాదాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వి.హనుమంతరావు (2004-2016), రాపోలు ఆనంద భాస్కర్ (2012-2018), పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (2012-2017) వంటి వారిని కూడా ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి (2002-2008), అల్లాడి పి.రాజ్‌కుమార్ (2000-2006), అకరపు సుదర్శన్ (2002-2008) వంటి నాయకులను రాజ్యసభకు పంపారు. ఇక వైఎస్సార్‌సీపీ పాలనలో గుజరాత్‌కు చెందిన పరిమల్ నథ్వానీ (2020-2026), తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య (2022-2028), ఎస్.నిరంజన్ రెడ్డి (2022-2028)లను నామినేట్ చేసి, పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నాయకులను ఎంచుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ విషయం కూటమి సర్కార్‌ను తీవ్ర డైలమాలో పడేసింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన మధ్య సీట్ల పంపకాలు, మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన.. ఇవన్నీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును గుక్కతిప్పుకోనివ్వడం లేదు. రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఈ విషయమై కేంద్ర నేతలతో చర్చించినట్టు సమాచారం. అయితే ఫలితం ఏమిటనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది.

నాలుగు స్థానాలు.. మూడు పార్టీల లెక్కలు

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు మొత్తం 11 సీట్లు ఉండగా, 2026లో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు సీట్లు టీడీపీకి, ఒకటి జనసేనకు ఇవ్వాలని మొదట చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. ఇది కూటమి ఒప్పందానికి అనుగుణంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో ఈ లెక్కలు తారుమారయ్యాయి. తమిళనాడుకు చెందిన తమ పార్టీ నేతను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబును కోరినట్టు టాక్. ఈ ప్రతిపాదన టీడీపీకి పిడుగు పాటులా మారింది.. ఫలితంగా మూడు సీట్లు టీడీపీకి ఇవ్వాలన్న ఆలోచనలు స్తంభించాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీజేపీ ఈ ప్రతిపాదన తేవడానికి ప్రధాన కారణం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. పార్టీకి దక్షిణాదిన బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో ఈ వ్యూహం రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ బలం తక్కువగా ఉండటంతో టీడీపీ సహకారం లేకుండా సీటు గెలుచుకోవడం కష్టమే. దీంతో కూటమి భాగస్వామి అయిన టీడీపీపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం.

చంద్రబాబు ఆలోచనలు: సానా, మస్తాన్‌లకు మళ్లీ అవకాశం? లింగమనేని ఎక్కడికి?

టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు తీవ్ర ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్, బీద మస్తాన్ రావు లను మరోసారి పంపించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇద్దరూ 2024 ఉప ఎన్నికల్లో గెలిచినవారే. వారి అనుభవం, పార్టీకి విధేయత ఆధారంగా ఈ ఆలోచన ఉంది. అదే సమయంలో లింగమనేని రమేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు స్థలాలు, భవనాలు అందించిన లింగమనేని.. టీడీపీ తరపున రాజ్యసభకు పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. "పార్టీకి సేవలు చేసినవారికి ప్రాధాన్యం" అన్న లెక్కలో ఆయన పేరు తెరపైకి వచ్చింది.

అయితే బీజేపీ ప్రతిపాదనతో టీడీపీ సీట్లు తగ్గిపోతాయన్న ఆందోళనలో లింగమనేనిని జనసేన కోటాలో చేర్చాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు టాక్. ఇది పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదని, జనసేనలోనే స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

జనసేనలో వత్తిడి: ముందంజలో ఏవీ రత్నం పేరు

జనసేన పార్టీలో కూడా రాజ్యసభ సీటు విషయం చర్చనీయమైంది. పార్టీ కోశాధికారి ఏవీ రత్నంను రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్‌పై వత్తిడి పెరిగింది. రత్నం పార్టీ ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. "స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. బయటి వారికి సీటు ఎందుకు?" అన్న గళాలు జనసేనలో బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రతిపాదన ఒప్పుకుంటే, జనసేన సీటు కూడా ప్రమాదంలో పడవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి.

ఢిల్లీ పర్యటన: చంద్రబాబు ఒప్పించారా? లింగమనేనికి దక్కదా?

ఈ అయోమయాల మధ్య చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ ప్రతిపాదనపై ఆయన ఏమి చెప్పారు? కేంద్ర పెద్దలను ఒప్పించి, టీడీపీ సీట్లు కాపాడుకున్నారా? లేక బీజేపీకి మాటిచ్చి, లింగమనేని వంటి నేతలకు నిరాశే మిగిల్చారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం, "కూటమి ఐక్యత కాపాడుకోవాలంటే రాజీ అనివార్యం. బీజేపీకి ఒక సీటు ఇచ్చి, రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించవచ్చు" అంటున్నారు.

మొత్తంగా ఈ రాజ్యసభ సీట్ల భర్తీ కూటమి భవిష్యత్‌కు కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం లేకుంటే, ఎదురుదెబ్బలు తప్పవు. అభ్యర్థుల ఎంపిక త్వరలో ఫైనల్ అవుతుందా? లేక మరిన్ని ట్విస్టులు ఉంటాయా? అనేది చూడాలి. రాజకీయ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది!

Live Updates

  • 13 Feb 2026 9:38 AM IST

    మందకొడిగా కౌంటింగ్ ప్రారంభం!

    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి దొరకలేదు. ఇన్ చార్జ్ ఇంటి వద్ద మర్చిపోవడంతో గత్యంతరం లేక ఇనుప రాడ్తో తాళం చెవి పగలగొట్టారు.. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గయాబ్ పై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో

    మందకొడిగా కౌంటింగ్ ప్రారంభం!

    ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు ఎనిమిదిన్నర వరకు కూడా ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు, ఏజెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తొమ్మిది దాటిన పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు ఏజెంట్లు..

  • 13 Feb 2026 9:30 AM IST

    16న మునిసిపల్ చెయిర్ పర్సన్ల ఎన్నిక

    మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘటమైన కార్పొరేషన్‌ మేయర్ల, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక ఫిబ్రవరి 16న జరుగుతుంది.  సమావేశానికి కోరం ఉండాలి. మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరు కావాల్సి ఉంటుంది.

  • సూర్యాపేటలో కౌంటింగ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పి
    13 Feb 2026 9:27 AM IST

    సూర్యాపేటలో కౌంటింగ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పి

    సూర్యాపేటలో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ,ఎస్పి

  • 13 Feb 2026 9:24 AM IST

    ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అప్ డేట్


    12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొండిగారి త్రిలోక్ కుమార్( మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కుమారుడు) 100 ఓట్ల మెజారిటీతో విజయం.

    బీఆర్ఎస్ అభ్యర్థి కొండిగారి త్రిలోక్ కుమార్ 316 ఓట్లు

    కాంగ్రెస్ అభ్యర్థి ఏర్పుల చంద్రయ్య 216 ఓట్లు

Read More
Next Story