
ముందు వడ, సాంబార్ తినండి, తర్వాత మాట్లాడుకుందాం!
తమిళనాడు రాజభవన్ లో గవర్నర్ ముచ్చట
గంటకో తీరుగా నాలుగు రోజుల పాటు సాగిన తమిళ రాజకీయ హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్వీ అర్లేకర్ ఆహ్వానించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడినట్టయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కొత్త శకానికి నాంది పలకనుంది. అనేక మలుపులు, ఉత్కంఠభరిత చర్చల తర్వాత ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా రాజ్ భవన్ (లోక్ భవన్)లో సరదా సంభాషణలు, చలోక్తులతో పాటు అల్పాహారాల ముచ్చటా సాగింది. రాజ్ భవన్ కు చేరుకున్న టీవీకే, దాని మిత్రపక్షాల నేతలను గవర్నర్ స్వయంగా లోపలికి ఆహ్వానించారు. 'మెజారిటీ సాధించారని తెలిసింది, ముందు వడ, సాంబార్ తినండి' అంటూ అర్లేకర్ సరదాగా అన్నట్టు సమాచారం. రాజ్ భవన్ సిబ్బంది వడ, సాంబార్, హల్వా అందించారు.
మెజారిటీ లేదన్న కారణంతో గవర్నర్ అర్లేకర్ విజయ్ ను మూడు సార్లు రాజ్ భవన్ చుట్టూ తిప్పారు. ఓ దశలో ఇచ్చిన అపాయింట్‌మెంట్ కూడా రద్దయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో తమిళప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యారు. ఈ దశలో గవర్నర్ తన కేరళ పర్యటనను రద్దు చేసుకుని విజయ్ కు అపాయింట్‌మెంట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఈ దశలో పెచ్చరిల్లిన ఆగ్రహావేశాలను శాంతింప జేసేందుకు గవర్నర్ తన భవన్ లో ఈ మర్యాదలు చేశారని వినికిండి. శనివారం నాటి భేటీలో విజయ్ వివిధ పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు. ఈ సందర్భంలో గవర్నర్- విజయ్ కి సాదర స్వాగతం పలికారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో విజయ్, మిత్రపక్షాల నేతలకు వడ, హల్వా, కాఫీ అందించారు. అదే సమయంలో నేతలు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్‌లో మాట్లాడటం విశేషం.
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు: తాజా సమాచారం
విజయ్ ప్రమాణ స్వీకారం: కీలక వివరాలు
సమయం: ఆదివారం (మే 10, 2026) ఉదయం 10 గంటలు
వేదిక: చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం.
ముఖ్య అతిథులు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
మంత్రివర్గం: విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (వీరిలో బుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున, కె.ఎ. సెంగోట్టయ్యన్ వంటి ప్రముఖులు ఉన్నారు).
బల నిరూపణ: మే 13లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ విజయ్‌ను ఆదేశించారు.
మ్యాజిక్ ఫిగర్ సాధించిన తీరు (120/118)
తొలుత విజయ్ పార్టీ (TVK) 107 స్థానాల (అతను రెండు చోట్ల గెలవడంతో ఎఫెక్టివ్ స్ట్రెంత్ 107) వద్ద ఆగిపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ, చివరి నిమిషంలో సమీకరణాలు ఇలా మారాయి:
TVK: 107 సీట్లు
కాంగ్రెస్: 05 సీట్లు
CPI & CPI(M): 04 సీట్లు (ఒక్కొక్కటి 2)
VCK: 02 సీట్లు
IUML: 02 సీట్లు
మొత్తం బలం: 120 (మెజారిటీ మార్క్ 118 కంటే రెండు ఎక్కువ).
రాష్ట్రంలో 'రాష్ట్రపతి పాలన' రాకూడదనే ఉద్దేశంతోనే విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) నేత తిరుమావళవన్ ప్రకటించారు.
AIADMKలో ముదురుతున్న సంక్షోభం
ఒకవైపు విజయ్ పీఠం ఎక్కుతుండగా, ప్రధాన ప్రతిపక్షం AIADMKలో భారీ చీలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలో సుమారు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వీరంతా ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, కొందరు నేరుగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
పుదుచ్చేరి రిసార్ట్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు నేరుగా షణ్ముగం కార్యాలయానికి చేరుకోవడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
Next Story

