‘‘నాకే వ్యతిరేకంగా వార్తలు రాస్తారా, ఇక మీరు రావద్దు’’
x
డొనాల్డ్ ట్రంప్

‘‘నాకే వ్యతిరేకంగా వార్తలు రాస్తారా, ఇక మీరు రావద్దు’’

సీఎన్ఎస్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి మీడియా సంస్థలకు వైట్ హౌజ్ లోకి రాకుండా నిషేధం


తనకు వ్యతిరేకంగా పదేపదే వార్తలు ప్రసారం చేస్తున్నారనే కారణంతో సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ఛానెల్స్, వార్తా పత్రికలను వైట్ హౌజ్ లోకి అడుగు పెట్టకుండా ట్రంప్ నిషేధం విధించారు. వీటితో పాటు నిత్యం తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న మిగిలిన ఛానెల్స్ పై కూడా ఇదే విధంగా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఇవి తూర్పారపడుతున్నాయి. ట్రంప్ మొదటి పదవీ కాలంలోనూ, తాజాగా పదవీకాలంలోనూ ఇదే తరహ వార్తలను అవి వండివారుస్తున్నాయి. ఇవి డెమొక్రాటిక్ పార్టీని బహిరంగంగా మద్దతు పలుకుతుంటాయి.

తన పేరు మీద నిరంతరం నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న కారణంగా సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో లను తక్షణమే వైట్ హౌజ్ నుంచి నిషేధిస్తున్నట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్’ లో పోస్ట్ చేశారు. అమెరికా రాజ్యాంగంలోని మొదటి నిబంధనలలో వాక్ స్వాతంత్య్రం గురించి చెబుతుంది. కానీ ట్రంప్ వీటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో వాటితో చెక్ పెడుతున్నాడు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చి దాని పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా మార్చకూడదని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా కథనాలు ప్రసారం చేసింది. ట్రంప్ నిర్ణయాలను ఈ వార్తా సంస్థలు తప్పుపట్టాయి. దీనికి ప్రతీకారంగానే ట్రంప్ ఈ వార్తా సంస్థల జర్నలిస్ట్ లను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టులను ఓవల్ ఆఫీస్, ఎయిర్ ఫోర్స్ వన్, ఇంకా పూర్తిస్థాయి పత్రికా బృంద కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

కోర్టులో దావా..

తనకు అనుకూలంగా లేని వార్తా కవరేజీపై ట్రంప్ చాలాకాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వార్తా సంస్థలపై దావాలు వేయడం, వ్యక్తిగతంగా లేదా సోషల్ మీడియా ద్వారా విలేకరులపై విరుచుకుపడటం ఆయనకు అలవాటు.
అధికారంలోకి తిరిగి వచ్చినప్పటి నుంచి, ట్రంప్ ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, బీబీసీ, ఇతర వార్తా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. తన ప్రసంగంలో లేని భాగాలను బీబీసీ చేర్చినట్లు ఆయన కేసు వేయగా, కోర్టులో అది నిజమని రూఢీ అయింది. దీనితో ఆ సంస్థ ప్రతినిధులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.


Read More
Next Story