
యూరప్ ఎందుకు తగలబడిపోతోంది?
అమెరికానే కారణమా? ఐరోపా విధానాలనే కారణమా?
ఉదారవాదం అంటూ ఇన్నాళ్లుగా ప్రపంచానికి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన యూరప్.. దాని పరిణామాలను అనుభవిస్తోంది. విచ్చలవిడిగా వలసలను అనుమతి ఇవ్వడం, ఉక్రెయిన్ యుద్ధంలో తలదూర్చి ఇష్టానుసారంగా తమ దేశ టాక్స్ ప్లేయర్ల సొమ్మును ఖర్చు చేసిన ఫలితాలను అనుభవిస్తోంది.
పెరిగిన జీవన వ్యయాలు, గృహాల కొనుగోలు శక్తి లేకపోవడం, విద్యా, ప్రజా సేవలకు వ్యతిరేకంగా యువతను వీధుల్లోకి తీసుకొచ్చాయి. ఇందులో ముస్లిం వలసదారులు యూరప్ ను తగలబెట్టుస్తున్నారు.
ఏఐ సంకేత్ కార్యక్రమంలో ‘ది ఫెడరల్’ కు చెందిన సంకేత్ ఉపాధ్యాయ్ తో జరిగిన ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ నగ్మా సహార్ తన అభిప్రాయాలను వెల్లడించారు. వలసలపై రాజకీయ చర్చ, యూరోపియన్ ప్రభుత్వాల ప్రతిస్పందన, అమెరికాతో యూరప్ సంబంధాలు, భారత్ లో అహింసాత్మక ప్రదర్శనలతో ఉన్న స్పష్టమైన వ్యత్యాసం గురించి చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలు ఏం తెలియజేస్తున్నాయి? వాటి ఉద్దేశం ఏంటీ? ఎందుకు జరుగుతున్నాయి?
దీనిని నిరసనలకాలం అని చెప్పవచ్చు. భారత్ లోని యువత వీధుల్లోకి రావడం చూశాము. ఈ నిరసనలు ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, అల్బేనియా వంటి ఐరోపా దేశాలలో ఇది కనిపిస్తోంది. ఐరోపా తగలబడుతోంది. ఈ ప్రదర్శనలు వేర్వేరు కారణాల వల్ల జరుగుతున్నప్పటికీ, వీటన్నిటికి మూలంలో లోతుగా పాతుకుపోయిన అసంతృప్తి ఉంది. ఇప్పటికే విభేదాలు, ఏ చిన్న ప్రేరేపణ కలిగినా, అది భారీ నిరసనలకు దారితీసింది.
దేశాల వారీగా మనం గమనిస్తే.. ఫ్రాన్స్ లో ప్యారిస్ కేంద్రంగా ఉంది. కానీ అనేక కీలక నగరాల్లో నిరసనకారులు అనేక భవనాలకు నిప్పు పెడుతున్నారు. బోర్డో వంటి పట్టణాలు తగలబడిపోతున్నాయి. ప్రజలు మొదటగా పెరుగుతున్న పాఠశాల ఫీజులు లేదా సరిపోని విద్యా సౌకర్యాలపై నిరసనలు ప్రారంభించారు. కానీ దాని వెనక అంతకంటే తీవ్రమైన అసంతృప్తి ఉంది.
కొంతమంది తీవ్ర వామపక్ష నాయకులకు వలస విధానాలను నిందించడం చాలా సులభం. ఉదాహారణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ నిరసనలు యూరప్ అనుసరించిన విధానాల ఫలితమే అంటూ దుయ్యబట్టారు. సరిహద్దులను వెంటనే మూసివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కోరారు.
యూరప్ చాలా ఉదారవాద వలస విధానాన్ని అనుసరిస్తోంది. అధిక శాతం వలసదారులు ఈ దేశాలలోనే నివసిస్తున్నారు. అయినప్పటికీ పాఠశాల విద్యార్థులు, యువకులు నిరసనలు ప్రారంభించిన వెంటనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఈ అశాంతిని రెచ్చగొడుతున్నది తీవ్రవామపక్షమేనని ఆరోపించారు. ఇటలీ, అల్భేనియా వంటి దేశాలు తీవ్ర గృహ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పెయిన్ లో కూడా మనం ఇలాంటి అసంతృప్తే చూస్తున్నాము.
ఐరోపా అంతటా జరుగుతున్న ఈ నిరసనలకు ఏమైనా సంబంధం ఉందా? ఇవి కేవలం తమ తమ దేశాలలో విడివిడిగా నిరసన చేస్తున్న పౌరులు మాత్రమేనా?
ఈ దేశాలలో ఒక్కసారిగా నిరసనలు జరగడం యాధృచ్చికం. ఇదే సమయంలో భారత్ లోని జెన్ జీ కూడా వీధుల్లోకి వచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పాఠశాలల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి, క్షీణిస్తున్న ప్రజా సేవలు వంటివి ఇందుకు కారణాలని, ఇవి ఐరోపా అంతటా ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయని వారు తెలిపారు.
ఐరోపా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంవత్సరాలుగా ఐరోపా మొద్దు నిద్ర పోతోందని అనేవారు, కానీ ఇప్పుడు దాని ఫలితాలు వీధుల్లో కనిపిస్తున్నాయి. తీవ్రమైన గృహ సంక్షోభం తోడవ్వడంతో పౌరులు దుర్భరమైన సమయాన్ని అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.
ఉదాహారణకు అల్భేనియాలోని టిరానాలో ఫ్లెమింగూ ప్రాజెక్ట్ కు సంబంధించిన అవినీతికి వ్యతిరేకంగా ఒక విద్యార్థి ఉద్యమం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తో సంబంధం ఉన్న ఆ విలాసవంతమైన నిర్మాణ ప్రాజెక్ట్ ను ఫ్లెమింగోల కోసం ఉద్దేశించిన భూమిలో నిర్మించారు.
ఈ అవినీతిపై ప్రజలు నిరసనల తెలుపుతూ సోషలిస్ట్ ప్రధానమంత్రి ఏడీ రామా పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలను చూస్తూ యువత సైలెంట్ గా చూడటానికి సిద్దంగా లేరు. వారు మార్పును, జవాబుదారితనాన్ని కోరుకుంటున్నారు.
భారత్ లో చాలా వరకూ శాంతియుతంగా జరిగిన నిరసనలకు భిన్నంగా ఫ్రాన్స్, అల్బేనియా వంటి ఐరోపా దేశాలలో జరిగిన ప్రదర్శనలలో విస్తృతమైన హింస, దహనకాండ, దోపిడీలు జరుగుతున్నాయి? అవి ఎందుకు హింసాత్మకంగా మారాయి?
ఫ్రాన్స్ లో ప్రజా పోరాటాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ స్థాయి హింసను చూడటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఫ్రాన్స్ చాలా ఉదారవాద సమాజంగా ఉంది. కానీ పౌరులు నిరసన తెలియజేయవచ్చని, అయితే ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టడం ఆమోదయోగ్యం కాదని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సరిగ్గానే పేర్కొన్నారు. అదే విధంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని కూడా నిరసన తెలియజేయడం ఒక హక్కు. కానీ ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టడం హక్కు కాదని పేర్కొన్నారు.
లిమోజెస్ లో ఒక టౌన్ హాల్ ను తగులబెట్టగా, మొత్తంగా 143 టౌన్ హాల్ లను లక్ష్యంగా చేసుకున్నాయి. మధ్య ప్యారిస్ లోని లూయిస్ విట్టన్, ఆపిల్ స్టోర్స్, గ్యాలరీస్ లాఫాయెట్ వంటి సంపదకు, పెట్టుబడిదారి విధానానికి చిహ్నాలైన విలాసవంతమైన సంస్థలను దోచుకుని తగులబెట్టారు.
అదృష్టవశాత్తూ భారత్ లో ఇలా జరగలేదు. ఇక్కడి నిరసనలు చాలావరకూ శాంతియుతంగా జరిగాయి. పోలీసుల ఘర్షణలు, లేదా నిర్బంధాలు ఎదుర్కొన్నప్పటికీ, యువత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా బయటకు వచ్చారన్న విషయం మనకు గర్వకారణం.
ఆర్థిక సంక్షోభం, దేశీయ అశాంతి, డొనాల్డ్ ట్రంప్ హాయాంలో యూఎస్ తో సంబంధాలలో వచ్చిన మార్పు నేపథ్యంలో ఈ దేశీయ వ్యతిరేకత ఐరోపా విదేశాంగ విధానంలో మౌలిక మార్పుకు దారితీయగలదా?
అమెరికాతో యూరప్ సంబంధాలు ఒక పెద్ద మలుపు తీసుకుంటున్నాయి. యూరప్ అమెరికాతో తన సంబంధాలను పున: సమీక్షించుకోవలసి ఉంటుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో గానీ, ఇరాన్ పై సైనిక చర్యల విషయంలో గానీ, అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల యూరప్ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. దీనికి ప్రపంచం ఇప్పటికే మూల్యం చెల్లిస్తూనే ఉంది.
డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికలకు సిద్దమవుతూ స్వదేశంలో గ్యాస్ ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో తన ఓటర్ల మద్దతును కాపాడుకోవడానికి రష్యాతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే సమయంలో ‘మాగా’ నినాదం ఊపందుకుంది.. దీనితో పాటు ఉద్యోగాలు పొందుతున్న అర్హత గల భారతీయులతో సహ విదేశీ నిఫుణుల పట్ల వ్యతిరేకత కూడా పెరిగింది.
ప్రస్తుతం ఐరోపా ఎదుర్కొంటున్నది ఒక కీలకమైన సమయం, తీవ్రమైన అంతర్గత సంక్షోభం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఐరోపాలోని కీలక ఆర్థిక చోదక శక్తులు, మిగతా ప్రపంచాన్ని చూసే విధానాన్ని అమెరికాతో వ్యవహరించే తీరును పున:పరీశీలించుకోవాలి.
ఈ సంక్షోభంపై ఐరోపా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి? వారి విధానం కేవలం చట్టాన్ని అమలు చేసే చర్య మాత్రమేనా? ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి విధానపరమైన మార్పులను ప్రవేశపెడుతున్నారా?
ప్రస్తుతం ఐరోపా నాయకత్వం ఈ పరిస్థితికి అనూహ్యంగా సిద్దపడినట్లు కనిపిస్తోంది. ఉదాహారణకు స్పెయిన్ చాలాకాలంగా గృహ సంక్షోభంతో సతమతమవుతోంది. అద్దె విధానంలో మార్పు కారణంగా ఇల్లు భరించలేనిదిగా మారడంతో 87 ఏళ్ల వృద్ధురాలిని ఆమె మరణించిన తండ్రి ఇంటి నుంచి వెళ్లగొట్టిన సంఘటన ఒక హృదయ విదారకమైన కేసు.
ఆమె నిరసన శిబిరంలో నివసించి, ఆసుపత్రిలో చేరి, మరణించడంతో అది విస్తృత నిరసనలకు దారితీసింది. ఫ్రాన్స్ లో ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ప్రతిస్పందన ఎక్కువగా పోలీసు చర్యలపైనే ఆధారపడింది. ఫ్రాన్స్ లో అధికారులు 2,400 మందికి పైగా అరెస్ట్ లు చేసి కఠినమైన శాంతిభద్రతల చర్య తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఇటలీ నాయకత్వం కూడా ఇలాంటి కఠిన హెచ్చరికలనే జారీ చేసింది.
ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు ప్రతిచర్యాత్మకంగా, అల్లరి మూకలను నియంత్రించడంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించి నిర్దిష్ట విధాన ప్రకటనలను మనం చూడలేదు. చివరికి ఐరోపా తన సామ్యవాద, సంక్షేమ రాజ్య నమూనాని పున: పరిశీలించుకోవలసి ఉంటుంది.
పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి...
Next Story

