మంటలను ఆర్పే క్రమంలో రెండు హెలికాప్టర్ల ‘ఢీ’
x

మంటలను ఆర్పే క్రమంలో రెండు హెలికాప్టర్ల ‘ఢీ’

ఇద్దరు సిబ్బంది మృతి


Click the Play button to hear this message in audio format

గ్రీస్‌లో కార్చిచ్చులను ఆపే క్రమంలో రెండు హెలికాప్టర్ల ఢీకొన్న ఘటన నెలకొంది. ఏథెన్స్‌కు పశ్చిమాన ఉన్న ప్సాతా ప్రాంతంలో కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో బెల్ కంపెనీకి చెందిన రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక హెలికాప్టర్ కూలిపోగా ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. యూరప్ దేశాలపైన ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్ ఎక్కువగా కార్చిచ్చుల బారిన పడ్డాయి.

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరు గ్రీకు కాగా, మరొకరు డానిష్ జాతీయుడు. మరో ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరించడంతో వైమానిక సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది, 23 విమానాలు కార్చిచ్చును ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, సముద్ర మార్గం ద్వారా వందల మందిని రక్షించారు.

ఫ్రాన్స్‌లోని గిరాండే ప్రాంతంలో సుమారు 420 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. మంటల వ్యాప్తి నిలిచినప్పటికీ, వేలాది మంది ఇప్పటికీ తమ ఇళ్లకు చేరుకోలేక ఇంక పునరావాస కేంద్రాలలోనే తలదాచుకుంటున్నారు.

ప్రోవెన్స్ ప్రాంతంలో మరో కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 3,000 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. పలు దేశాల నుంచి అదనపు సహాయక బృందాలను కూడా మోహరించారు.

స్పెయిన్‌లో ప్రధాన కార్చిచ్చుల వ్యాప్తి నిలిచినప్పటికీ, మళ్లీ చెలరేగకుండా అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. వేలాది మంది ఇప్పటికే తమ నివాసాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది నమోదైన అగ్నిప్రమాదాలు దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనవిగా నిలిచాయి.

శాస్త్రవేత్తల ప్రకారం, ఐరోపా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలులు కార్చిచ్చుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావమే ఇటీవలి భారీ అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More
Next Story