
"ఓరి పిచ్చి వెదవల్లారా, హర్మోజ్ ను తెరుస్తారా, చస్తారా!"
ఇరాన్ పై నోరుపారేసుకున్న ట్రంపు, తేల్చుకుందామన్న ఇరాన్, 38వ రోజుకు చేరిన యుద్ధం
ఇరాన్-అమెరికా యుద్ధం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు నేటి (మంగళవారం) అర్ధరాత్రితో ముగియనుంది. అటు హోర్ముజ్ జలసంధిని వదిలే ప్రసక్తే లేదని ఇరాన్ భీష్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పాలకులపై నోరు పారేసుకున్నారు. ఓరి పిచ్చివెదవల్లారా అంటూ ఇరాన్ ను సంబోధించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరణంలో ఈ యుద్ధానికి మతం రంగు పులిమే ప్రయత్నం కూడా ట్రంప్ చేశారు.
"ఈస్టర్ మిరాకిల్" - యుద్ధానికి మత రంగు?
అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక సైనికుడిని ఇరాన్ చెర నుంచి సురక్షితంగా రక్షించడాన్ని ట్రంప్ ప్రభుత్వం ఒక "ఈస్టర్ మిరాకిల్" (ఈస్టర్ అద్భుతం) గా అభివర్ణించింది. దీన్ని దైవ నిర్ణయంగా, ఈ యుద్ధాన్ని ఒక "ధర్మ యుద్ధం"గా ట్రంప్ అభివర్ణించడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.
"ఆ రెస్క్యూ ఒక ఈస్టర్ అద్భుతం" అని ట్రంప్ NBC ఛానల్ పెట్టిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో చెప్పారు. ఆయన బాటలోనే కొంతమంది క్యాబినెట్ సభ్యులు కూడా తమ సందేశాలను ఇచ్చారు.
రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ఆదివారం నాడు తన ప్రైవేట్ ఎక్స్ (X) ఖాతాలో “దేవుడు గొప్పవాడు” (God is good) అని రాశారు. ఇరాన్‌లో రెస్క్యూ మిషన్ విజయవంతం కావడం గురించి ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను ఆయన రీపోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్య చేశారు.
రిపబ్లికన్ ట్రంప్, పేరు వెల్లడించని ఒక అమెరికా రక్షణ అధికారి ఇంటర్వ్యూను ఉటంకిస్తూ.. రక్షించిన అధికారి తన విమానం నుండి ఎజెక్ట్ (బయటకు దూకేసిన) అయిన తర్వాత రేడియో ద్వారా పలికిన మాటలు కూడా అవేనని ఆక్సియోస్ (Axios) రిపోర్ట్ చేసింది. 2025లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా.. 2024 ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన హత్యాయత్నం నుండి దేవుడే తనను కాపాడారని ట్రంప్ చెప్పారు. “నా జీవితం ఒక కారణం కోసమే రక్షించబడిందని అప్పుడు అనిపించింది, ఇప్పుడు అది ఇంకా బలంగా నమ్ముతున్నాను. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దడానికే దేవుడు నన్ను రక్షించాడు” అని ఆయన అప్పుడు పేర్కొన్నారు.
ఇరాన్‌లో ఒక అమెరికన్ ఎయిర్‌మ్యాన్‌ను రక్షించేందుకు చేసిన సైనిక చర్యను మతపరమైన కోణంలో చిత్రీకరించడం ద్వారా, ఈ యుద్ధం న్యాయమైందని, దీనికి దైవ ఆశీస్సులు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వాలు సాధారణంగా ఈస్టర్ సందర్భంగా పోస్ట్‌కార్డ్ తరహా శుభాకాంక్షలు పంపేవి. అయితే, ఈసారి అధికారులు యుద్ధాన్ని సమర్థించుకోవడానికి, సైనిక చర్యలను సమర్థించడానికి మతాన్ని వాడుకోవడం ద్వారా విశ్వాసానికి, ప్రభుత్వ విధానానికి మధ్య ఉన్న గీతను చెరిపివేశారని విమర్శకులు మండిపడుతున్నారు.
స్వదేశంలోనే ట్రంప్ పై విమర్శలు..
రిపబ్లికన్ మాజీ ప్రతినిధి మర్జోరీ టేలర్ గ్రీన్ ఎక్స్ (X) లో రాస్తూ.. ట్రంప్ క్రైస్తవ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలోని క్రైస్తవులు "యుద్ధాన్ని ఉధృతం చేయడం" కంటే "శాంతిని నెలకొల్పడానికి" కృషి చేయాలని ఆమె అన్నారు. శత్రువుల పట్ల కూడా క్షమ, ప్రేమను చూపాలని ఏసు బోధనలు నొక్కిచెప్పాయని ఆమె వాదించారు.
మరో సందేశంలో మతాన్ని వేరొక విధంగా వాడుతూ.. పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామని ట్రంప్ సోషల్ మీడియాలో హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిని తెరవండిరా "పిచ్చి వెధవల్లారా" (you crazy bastards) అంటూ ఇరాన్‌ను తిట్టారు. లేదంటే "నరకంలో బతకాల్సి ఉంటుంది" అని హెచ్చరించారు. ఆయన తన సందేశాన్ని "Praise be to Allah" అనే వాక్యంతో ముగించారు.
ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సోషల్ మీడియా సందేశంలో ఈస్టర్ ప్రతీకలను ప్రస్తావించారు. "చరిత్రలోనే అతిపెద్ద విజయంగా ఈస్టర్ అద్భుతం నిలిచిపోతుంది. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈ రోజున, సైనిక చరిత్రలోనే గొప్ప సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో ఇదొకటి. శత్రువుల నుంచి ఒక సాహసోపేతమైన అమెరికన్ యోధుడిని రక్షించడం సముచితం" అని ఆయన ఎక్స్ (X) లో పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా ఇరాన్ పాలకులను "క్రేజీ బాస్టర్డ్స్" అని తిడుతూనే, తన పోస్ట్ చివరలో "Praise be to Allah" అని పేర్కొనడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది ఒక దేశాధినేత వాడాల్సిన భాష కాదని దౌత్యవేత్తలు విమర్శిస్తున్నారు.
ఇరాన్ హెచ్చరికలు...
హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వరకు గడువు విధించడంతో.. ఇరాన్ ప్రతికార దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న ఒక నివాస భవనంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో కనీసం ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు ఇంకా కనిపించకుండా పోయారు.
అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ అంతటా కనీసం 12 నగరాలపై దాడులు చేశాయి. టెహ్రాన్‌లోని బహారెస్థాన్ కౌంటీలో జరిగిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
గల్ఫ్ అంతటా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. కువైట్‌లోని విద్యుత్, మంచినీటి తయారీ (డీశాలినేషన్), చమురు ప్లాంట్లపై దాడులు జరగ్గా.. బహ్రెయిన్‌లోని ఒక చమురు కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
అర్ధరాత్రి డెడ్ లైన్ - నరకం తప్పదా?
మంగళవారం అర్ధరాత్రితో ట్రంప్ అల్టిమేటం ముగియనుంది. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామని, ఇరాన్ "నరకప్రాయమైన" జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ ప్రతిఘటన: ఇరాన్ ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తోంది. ఏ క్షణమైనా అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై భారీ ప్రతిదాడి చేస్తామని సిద్ధమైంది.
విస్తరిస్తున్న యుద్ధ జ్వాలలు...
యుద్ధం 38వ రోజున ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న ఒక నివాస భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఇరాన్‌లో విధ్వంసం: అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లోని 12 నగరాలపై విరుచుకుపడ్డాయి. టెహ్రాన్‌లోని బహారెస్థాన్ కౌంటీలో జరిగిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
గల్ఫ్ దేశాలపై ప్రభావం: కువైట్, బహ్రెయిన్‌లలోని చమురు నిల్వ కేంద్రాలు, డీశాలినేషన్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి.
ట్రంప్ ఆరోగ్యంపై సందిగ్ధత - అమెరికా ఖండన
యుద్ధం పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, వీటిని వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, యుద్ధ వ్యూహాలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని రక్షణ శాఖ తెలిపింది.
ఇవాళ అర్ధరాత్రితో అల్టిమేటం ముగియనుండటంతో, ఇరాన్ తన పంతం వీడకపోతే బుధవారం ఉదయం నాటికి యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారే ముప్పు పొంచి ఉంది. ఒకవైపు "దేవుని అద్భుతం" అని చెబుతూనే, మరోవైపు "నరకం చూపిస్తా" అని హెచ్చరిస్తున్న ట్రంప్ వైఖరి ఈ యుద్ధాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.
Next Story

