ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ ని గుర్తించడం కష్టమే!
x
మొజ్తాబా ఖమేనీ ఏఐ ఇమేజ్

ఇరాన్ 'సుప్రీం' మొజ్తాబా ఖమేనీ ని గుర్తించడం కష్టమే!

ఓ కాలు తీసివేశారా, శరీరంలో చలనం లేదా.. ఇరాన్ లో అసలేం జరుగుతోంది!


ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఆయన పెద్ద కుమారుడు మొజ్తాబా ఖమేనీని ఆ దేశ అధిపతిగా నియమించారు. ఇప్పుడాయన మృత్యువుతో పోరాడుతున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఒక కాలు తీసేశారు. శరీరంలో చలనం తప్ప మాటా, పలుకు లేదు. కోమాలో ఉన్నారు. అమెరికా దాడులకు భయపడి పూటకో చోటుకు తిప్పుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

క్షిపణి దాడిలో ఛిద్రమైన జీవితం

ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌పై జరిగిన దాడి సమయంలో మొజ్తాబా అక్కడే ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులు ఆ భవనాన్ని తాకడంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
గత ఏడాది ఇదే రోజున టెహ్రాన్ వీధుల్లో తిరుగాడిన మొజ్తాబా
ముఖం గుర్తుపట్టలేనంతగా తయారైంది. బాంబుల నుంచి వెలువడిన లోహపు ముక్కలు ఆయన ముఖాన్ని బలంగా తాకాయి. దీనివల్ల ఆయన ముఖం ఒకవైపు పూర్తిగా చిధ్రమైందని, ఒక కన్ను కూడా పోయిందని అంతర్జాతీయ నిఘా వర్గాలు ధ్రువీకరించాయి.
గాయాల తీవ్రత కారణంగా ఆయన ఒక కాలును శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు (Amputation) తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చక్రాల కుర్చీకి లేదా మంచానికే పరిమితమయ్యారు.
కేవలం శారీరక గాయాలే కాకుండా, మొజ్తాబాను వ్యక్తిగత నష్టం మరింత కృంగదీసింది. అదే దాడిలో ఆయన భార్య జహ్రా, టీనేజ్ కుమారుడు మొహమ్మద్ బాఘర్ మరణించారు. ఇరాన్ భావి నాయకుడిగా భావించిన తన కుమారుడిని కళ్లముందే కోల్పోవడం మొజ్తాబాను మానసిక కోమాలోకి నెట్టినట్లు సమాచారం.
ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీనిపై అంతర్జాతీయ మీడియా భిన్నమైన కథనాలను ప్రచురిస్తోంది.
'ది టైమ్స్', 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' కథనాల ప్రకారం, మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. పవిత్ర నగరం 'కోమ్' (Qom)లో చికిత్స పొందుతున్నారని అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఈ పత్రికలు రాశాయి.
అయితే ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా మాత్రం ఆయనకు కేవలం కాలుకి చిన్న గాయం మాత్రమే అయిందని, ఆయన క్షేమంగానే ఉన్నారని చెబుతోంది. అందుకు తగ్గట్లుగా ఆయన నడుస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు ఉన్న లైవ్ వీడియోలను మాత్రం విడుదల చేయలేకపోతున్నారు. ఇది అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే...

ఆయన మంచంపై ఉన్న ఫోటోలు కొన్ని లీక్ అయినట్లు వార్తలు వచ్చినా, ఎవరూ ధృవీకరించలేదు. ఒకవేళ ఆయనకు కాలు తీసివేసిన వార్త నిజమైతే, ఇరాన్ వంటి దేశంలో ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం కష్టమౌతుంది. అందుకే IRGC (రివల్యూషనరీ గార్డ్స్) ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ పాలనను సాగిస్తోందని తెలుస్తోంది.
మొజ్తాబా ఖమేనీ ముఖానికి సంబంధించిన గాయాలపై అంతర్జాతీయ మీడియాలో భయంకరమైన కథనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ దేశాల నిఘా వర్గాల ఉటంకిస్తూ రాస్తున్న వార్తలు హృదయవిదారకంగా ఉన్నాయి. వైమానిక దాడుల్లో ఆయన ముఖం ఒక వైపు పూర్తిగా చిధ్రమైందని , గుర్తుపట్టలేనంతగా మారిందని వార్తలు వస్తున్నాయి. ఒక కన్ను కూడా దెబ్బతిన్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆయన ముఖాన్ని మాములుగా చేసేందుకు అత్యుత్తమ వైద్య బృందాలు ప్రయత్నిస్తున్నాయని, అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ప్రజల ముందుకు ఎందుకు రావడం లేదు?
సాధారణంగా ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో 'సుప్రీం లీడర్' అంటే దైవ సమానుడు. అత్యంత శక్తిమంతుడిగా కనిపిస్తూ ప్రజల్లో స్ఫూర్తి నింపాలి. కానీ, ఇప్పుడు మొజ్తాబా ఒక కాలు కోల్పోయి, ముఖం గుర్తుపట్టలేనంతగా మారి ఉండటం వల్ల ఆయనను ప్రజల ముందుకు తీసుకురావడానికి IRGC జంకుతోంది. ఆ రూపంలో ఆయనను చూస్తే ఇరాన్ ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని, సైన్యం మనోధైర్యం దెబ్బతింటుందని వారు భావిస్తున్నారు.
అందుకే ప్రస్తుతం ఇరాన్ మీడియా విడుదల చేస్తున్న వీడియోలన్నీ పాతవి లేదా ఏఐ (AI) తో సృష్టించినవి మాత్రమేనని అంతర్జాతీయ విశ్లేషకులు ఖచ్చితంగా చెబుతున్నారు.

అధికారం 'ఐఆర్‌జీసీ' దే...

మొజ్తాబా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉండటంతో, ఇరాన్ పగ్గాలను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడు పెజెష్కియాన్ కేవలం నామమాత్రపు అధికారిగా ఉండగా, యుద్ధ తంత్రాలన్నీ ఐఆర్‌జీసీ కమాండర్లు నిర్వహిస్తున్నారు.
ఇరాన్‌ను ఉక్కుపిడికిలితో శాసించాలని కలలుగన్న మొజ్తాబా, ఇప్పుడు తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇరాన్ ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. ఒకవేళ ఆయన మరణిస్తే, ఇరాన్ పూర్తిగా సైనిక నియంతృత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ మీడియా కథనాలు...
ది వాషింగ్టన్ పోస్ట్: "మొజ్తాబా ఖమేనీ ఒంటరి అయ్యారు.. బయటి ప్రపంచం నుంచి వస్తున్న ఏ సందేశాలకు ఆయన స్పందించడం లేదు."
బీబీసీ:
"ఇరాన్‌లో అంతర్గత అధికార పోరాటం ముదిరింది. పౌర ప్రభుత్వంపై సైనిక పట్టు బిగిస్తోంది."
ఇన్ఫర్మేషన్ వార్: ఇరాన్ నాయకత్వం గురించి వస్తున్న వార్తలన్నీ అమెరికా సృష్టిస్తున్న 'మానసిక యుద్ధం' (Psychological Warfare) అని ఇరాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు.
మొత్తానికి, ఇరాన్ ప్రస్తుతం ఒక దిక్కులేని స్థితిలో ఉందనేది అంతర్జాతీయ మీడియా సారాంశం. తదుపరి చర్చలకు ఇరాన్ వస్తుందా లేదా అనేది ఈ ఐఆర్‌జీసీ కమాండర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
Read More
Next Story