పశ్చిమాసియా మరోసారి దాడులకు  యూఎస్ సిద్దమవుతోందా?
x

పశ్చిమాసియా మరోసారి దాడులకు యూఎస్ సిద్దమవుతోందా?

పర్షియల్ గల్ఫ్ లో అదనపు బలగాలు మోహరిస్తున్న ట్రంప్


సీమా గుహా

యూఎస్, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు, మరోవైపు యుద్ధం దేనీ దారి దానిదే అన్న తరహాలో కొనసాగుతోంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు వారి వారి డిమాండ్లపై గట్టిగా పట్టుబడుతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

అయితే అమెరికా మాత్రం తన సైనిక శక్తిని మాత్రం క్రమంగా పెంచుకుంటూ పోతోంది. పర్షియన్ గల్ఫ్ లో ఇప్పటికే అది 50 వేలకు పైగా సైనికులను మోహరించింది. ఇప్పుడు వీరికి అదనంగా మరో పదివేల మంది సైనికులను పంపనుంది. అదనంగా మరో విమాన వాహకనౌక సైతం రానుంది.

రాజకీయ ప్రతికూలతలు..

అమెరికాలో ప్రస్తుతం మధ్యంతర ఎన్నికల సీజన్ నడుస్తోంది. అందుకే యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చినట్లు, తరువాత సైనిక దాడులు ప్రారంభిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఆయన మాటలకు అనుగుణంగానే ఇప్పుడు సైనిక మోహరింపులు జరుగుతున్నాయి.
అరేబియా సముద్రంలో కీలక ప్రాంతాలలో యూఎస్ నేవీ ఇప్పటికే పాగా వేసి కూర్చొంది. ఇరాన్ పై చేసిన దాడుల్లో సైనిక లక్ష్యాలు ఇప్పటికే అంతం అయ్యాయని ఇక పౌర మౌలిక సదుపాయాలు అయిన విద్యుత్ గ్రిడ్లు, డిశాలినేషన్ ప్లాంట్లు, వంతెనలు ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ దాడికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అమెరికాలో ఈ యుద్ధం పై తీవ్ర వ్యతిరేక కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పోల్ లో 71 శాతం వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇరాన్ విషయంలో అమెరికన్లు చేస్తున్నది తప్పని అంటున్నారు. 69 శాతం మంది యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నారని తేలింది. ట్రంప్ రేటింగ్ లు కూడా పాతాళంలోకి జారిపోయాయి. అలాగే జెరూసలెంలో కూడా ఎన్నికల జరగబోతున్నాయి. నెతాన్యాహూ కూడా రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

ట్రంప్ ఆలోచన ఏంటీ?

ఇరాన్- స్వీడీష్ మేధావి, వాషింగ్టన్ లో క్విన్సీ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రిటా పార్సీ మాట్లాడుతూ... ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో ట్రంప్ మంచి ముగింపు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. యుద్ధానికి వెళ్లడం వల్ల అమెరికాకు లాభం చేకూరిందని అందరికి చెప్పాలని ట్రంప్ ఉవాచ.
ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఫలించిందని, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఇరాన్ బలహీనంగా మారిందని ట్రంప్ వాదిస్తున్నారు. కానీ ఇరాన్.. వెనెజువెలా కాదు, నిర్ణయాత్మక సైనిక విజయం కోసం చేసే ఏ ప్రయత్నమైన ముఖ్యంగా భూతల దళాలు ఇందులో పాలుపంచుకుంటే అది సుదీర్ఘ సంఘర్షణగా మారవచ్చు.

తిరిగి యుద్ధం జరిగే అవకాశం ఉందా?

పశ్చిమాసియాలో హూతీల ప్రభావం వల్ల యుద్దం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ మద్దతు గల యెమెన్ బలగాలు హూతీ ప్రాంతాలపై తీవ్ర స్థాయిలో దాడులతో ప్రతిస్పందిస్తున్నాయి. ఈ దాడుల్లో భారీ స్థాయిలో హూతీలు మరణించారని యెమెన్ ప్రభుత్వ బలగాలు ప్రకటించాయి. అమెరికన్లకు ఈ యుద్దం అంటే ఇష్టం లేనప్పటికీ మధ్యంతర ఎన్నికలకు ముందే యుద్ధం తిరిగే ప్రారంభం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం ప్రారంభం అయినట్లయితే, అంతకుముందే ఇరాన్ ముందస్తు దాడులకు సిద్ధం కావచ్చు.
ప్రస్తుతం అమెరికా అనుసరిస్తున్న వ్యూహాలు, సైనిక మోహరింపులు ఇరాన్ పై గరిష్టంగా వ్యూహం భాగమా? పూర్తి స్థాయి యుద్ధానికి తిరిగి వెళ్లడానికి చేస్తున్న సన్నాహాల? దౌత్యం పెద్దగా పురోగతి సాధించకపోవడంతో ఈ ప్రాంతంలోని దేశాలు తమకున్న అవకాశాలను బేరీజు వేసుకుంటున్న తరుణంలో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పడం కష్టంగా ఉంది.


Read More
Next Story