LIVE IRAN WAR Destruction
x

బాంబు దాడులతో దద్దరిల్లు గల్ఫ్, ఇరాన్- అమెరికా యుద్ధం తీవ్రం!

600 దాటిన మరణాలు, బీరూట్ పైన దాడులు


ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తాజా అప్‌డేట్స్ (మార్చి 3, 2026 ఉదయం నాటికి):
టెహ్రాన్, బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మరణాలు 600 దాటాయి.

ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్, లెబనాన్‌లోని బీరూట్ పై భారీ వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ (IRIB) భవనంపై కూడా దాడి జరిగింది. ఇరాన్, లెబనాన్‌లలో మొత్తం మరణాలు 600 దాటాయి. (పౌరులు, సైనికులు కలిపి) టెహ్రాన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఎక్స్‌పెడియన్సీ కౌన్సిల్ భవనం, పోలీస్ స్టేషన్లు, ఇతర ముఖ్యమైన కేంద్రాలు దెబ్బతిన్నాయి.

యుద్ధం 4 వారాలకు పైగానే కొనసాగవచ్చు- ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ – ఇరాన్‌పై సైనిక కార్యాచరణ 4 నుంచి 5 వారాలు పట్టవచ్చనన్నారు. "అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు" అని చెప్పారు. ఇరాన్ మిసైల్ సామర్థ్యం, నావల్ ఫోర్స్‌లను నాశనం చేయడం, న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపడం, బయటి గ్రూపులకు సపోర్ట్ ఆపడం తమ ప్రధాన లక్ష్యాలు అని పేర్కొన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో "ఇంకా హార్డెస్ట్ హిట్స్ వచ్చేవే" అని హెచ్చరించారు. గ్రౌండ్ ట్రూప్స్ పంపే ఆలోచన కూడా ఉందన్నారు.
ఇరాన్ ప్రతీకార దాడులు..
గల్ఫ్‌లో ఎనర్జీ ఇన్‌ఫ్రా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) – స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను "క్లోజ్డ్" అని ప్రకటించింది. ప్రపంచ ఆయిల్ 20% దీని గుండా పాస్ అవుతుంది. ఏ నౌక వచ్చినా దాడి చేస్తామని హెచ్చరించింది. షిప్పింగ్ ట్రాఫిక్ భారీగా తగ్గింది. గల్ఫ్ దేశాల్లో ఎనర్జీ ఇన్‌ఫ్రా (కతార్ LNG ఫెసిలిటీలు, UAE, సౌదీలో టార్గెట్లు)పై దాడులు చేసింది. కతార్ LNG ప్రొడక్షన్ పూర్తిగా సస్పెండ్ అయింది. గ్లోబల్ ఆయిల్, గ్యాస్ ధరలు షార్ప్‌గా పెరిగాయి.

ఇతర ముఖ్య అప్‌డేట్స్

ఇరాన్ దాడులు: ఇజ్రాయెల్‌లో వెస్ట్ జెరూసలెం, టెల్ అవీవ్, ఏలట్ పై మిసైల్స్ దాడులు చేసింది.
గల్ఫ్‌లో: దుబాయ్‌లోని అమెరికా ఫోర్సెస్, కువైట్ అరిఫ్జాన్ బేస్‌పై డ్రోన్, మిసైల్ దాడులు జరిగాయి.

సౌదీ అరేబియా: రియాద్‌లోని US ఎంబసీపై డ్రోన్ దాడి. పరిమిత కాల్పులు, స్వల్పనష్టం. అమెరికన్లు షెల్టర్ జోన్ కి వెళ్లిపోవాలని ఆదేశం.
అమెరికా: మిడిల్ ఈస్ట్‌లోని 15కి పైగా దేశాల నుంచి US సిటిజన్స్‌ను "తక్షణమే వెళ్లిపోవాలి" అని ఆర్జెంట్ అడ్వైజరీ ఇచ్చింది. మరిన్ని రిఫ్యూలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ మిడిల్ ఈస్ట్‌కు వెళ్లాయి.
యునైటెడ్ నేషన్స్: ఇరాన్ ప్రైమరీ స్కూల్ పై బాంబు దాడిని "మానవతా చట్టం ఉల్లంఘన" అని UNESCO అప్‌డేట్ ఇచ్చింది. గోలెస్తాన్ ప్యాలెస్ (UNESCO హెరిటేజ్) డ్యామేజ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ సొసైటీ: షెల్టర్లలో ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో ప్రజల మధ్య గొడవలు మొదలయ్యాయి. హెజ్బుల్లా దళాలు పూర్తిగా ప్రవేశించాయి.

యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. ఇరాన్ ప్రతిఘటన తీవ్రమవుతోంది. గల్ఫ్ నుంచి ఇంధన సరఫరా దెబ్బతింటోంది. గ్లోబల్ ఇంపాక్ట్ పెరుగుతోంది. ట్రంప్ ప్రకారం ఇది ఇంకా మొదలే కాని ముగింపు కాదు. పరిస్థితి రోజుకో తీరున మారుతోంది. శాంతి చర్చల ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు.

Live Updates

  • 3 March 2026 6:04 PM IST

    ఇరాన్‌లో భారత విద్యార్థులపై తల్లిదండ్రుల ఆందోళన..

    పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న తమ పిల్లలను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీనగర్‌కు చెందిన 30 ఏళ్ల అల్తాఫ్ ఖాన్ తన సోదరి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అతని సోదరి సోబియా తెహ్రాన్‌లో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెతో కొద్దిసేపు మాత్రమే మాట్లాడగలిగామని, క్యాంపస్ దగ్గర తరచూ సైరన్లు మోగుతున్న శబ్దాలు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అల్తాఫ్ చెప్పారు.

    మరో తల్లి ఆఫ్రోజా కూడా తన కుమార్తె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె తెహ్రాన్‌లో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోందని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్యాంపస్ నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని, ఆహారం అవసరాలు కూడా తగ్గుతున్నాయని తన కుమార్తె తనతో చెప్పిందని ఆఫ్రోజా పేర్కొన్నారు. ఇతర దేశాలు తమ విద్యార్థులను ఇప్పటికే తరలించాయని ఆమె గుర్తు చేశారు.

    ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ ప్రతినిధి మహమ్మద్ మొమిన్ ఖాన్ మాట్లాడుతూ.. తెహ్రాన్ నుంచి తరలించిన భారత విద్యార్థులు భద్రంగా ఖోమ్‌కు చేరుకున్నారని తెలిపారు. ఈ చర్య భారత రాయబార కార్యాలయం సమన్వయంతో చేపట్టినట్లు చెప్పారు.

  • 3 March 2026 2:15 PM IST

    క్షేమంగా భారత్ చేరుకున్న పీవీ విందు

    దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంగ్లాండ్‌లోని ఆల్ ఇండియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ప్రయాణం చేస్తూ మధ్యలో దుబాయ్‌ చేరుకున్నారు. గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో ఆమె దుబాయ్‌లోనే ఉండిపోలాల్సి వచ్చింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకుని తిరిగి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు.

    “నేను బెంగళూరులో నా ఇంటికి క్షేమంగా చేరుకున్నాను. ఇంటికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టకాలంలో సాయం చేసిన దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ” అని ఎక్స్‌లో పోస్టు చేశారు రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు.

  • 3 March 2026 1:21 PM IST

    మహారాష్ట్రీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు..

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో చిక్కుకుపోయిన 164 మంది మహారాష్ట్రీయులను తిరిగి తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు విమానాలు ఫుజైరా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు, 4.30 గంటలకు బయలుదేరి సాయంత్రానికి ముంబై చేరుకుంటాయని ఆయన తెలిపారు. 164 మందిలో పుణేలోని ఇంద్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌కు చెందిన 84 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే థానే, అహిల్యానగర్, పుణే ప్రాంతాలకు చెందిన ఇతరులు కూడా ఉన్నట్లు సమాచారం.

    ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా యుద్ధ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సాయం అందజేస్తామని పేర్కొన్నారు.

    దుబాయ్‌లోని ఇండియన్ పీపుల్స్ ఫోరమ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ +971 50 365 4357 ను ప్రారంభించింది. సాయం అవసరమైన వారు ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. 

  • 3 March 2026 12:28 PM IST

    దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

    ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీ హత్యకు నిరసనగా జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో మంగళవారం పలు ప్రాంతాల్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. బుధాల్ ప్రాంతంలో స్థానికులు షేఖ్-ఉల్-ఆలం మసీదు ముందు చేరి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యను వారు ఖండించారు. ఆ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ముస్లిం ప్రపంచంపై దాడిగా అభివర్ణించారు. పీడీపీ సీనియర్ నేత మొహమ్మద్ ఫారూక్ ఇన్కలాబీ ఖామెనీ హత్య దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక స్వతంత్ర దేశ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. రాజౌరి పట్టణంలో ముస్లిం యువకులు “ఇరాన్ ఐక్యత ర్యాలీ” నిర్వహించారు. బేలా రోడ్ వద్ద ర్యాలీగా కదిలారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్ నాయకుల పోస్టర్లను దహనం చేశారు.

Read More
Next Story