ఇరాన్‌లో కూలిన యుఎస్ F-15..
x

ఇరాన్‌లో కూలిన యుఎస్ F-15..

శత్రు భూభాగంలో చిక్కుకున్న పైలెట్‌ను సురక్షితంగా కాపాడిన అమెరికా బలగాలు..


Click the Play button to hear this message in audio format

ఇరాన్–ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నైరుతి ప్రాంతంలో యుఎస్‌(U.S)కు చెందిన F-15E టు సీటర్ “స్ట్రైక్ ఈగిల్” యుద్ధ విమానం సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడగా, వెనక సీట్లో కూర్చున్న మరో పైలెట్ అదృశ్యమయ్యాడు. తమ భూభాగంలో ఉన్న ఆ పైలెట్ కోసం ఇరాన్ భద్రతా బలగాలు తీవ్రంగా గాలించాయి. అతన్ని పట్టిస్తే 60వేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. ఇరాన్ పౌరులను కూడా గాలింపులో భాగస్వామ్యం చేశారు.

అయితే అదృశ్యమైన పైలెట్ పర్వత ప్రాంతాల్లో దాక్కున్నాడు. ఆ తర్వాత అతి కష్టం మీద సుమారు 7వేల అడుగుల ఎత్తైన ప్రాంతానికి చేరుకుని తన ఉనికిని రహస్యంగా ఉంచాడు. అతని వద్ద కమ్యూనికేషన్ పరికరాల సాయంతో “శక్తి దేవునికి ఉండు” అనే రేడియో సందేశాన్ని యూఎస్ బలగాలకు పంపాడు. ఈ సందేశాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. చివరకు అతనే పంపాడని నిర్ధారించుకుని రక్షించేందుకు యుఎస్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. నేవీ సీల్ టీమ్ రాత్రి సమయంలో గోప్యంగా పైలెట్ ఉంటున్న ప్రాంతంలోకి ప్రవేశించి, రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించింది. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా అదృశ్యమైన పైలెట్‌ను సురక్షితంగా కాపాడారు.

ఇంతటి చాకచక్యంగా వ్యవహరించడానికి కారణం వారికి ఇచ్చే కఠిన శిక్షణనేనని U.S రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. శత్రు ప్రాంతాల్లో మనుగడ, తప్పించుకునే వ్యూహాలు, రక్షణ బృందాలతో సమన్వయం వంటి అంశాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శత్రు భూభాగంలో విడిపోయిన సిబ్బందిని సురక్షితంగా రక్షించడం అరుదైన విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ సైనిక చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే ఘటనగా పేర్కొంటున్నారు.

కాగా “శత్రు భూభాగంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రక్షణ చర్యను విజయవంతంగా పూర్తి చేయడం మా దళాల సామర్థ్యానికి నిదర్శనం,” అని యుఎస్ రక్షణ విభాగానికి చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు.

“ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణే మా సిబ్బందిని కాపాడింది. ప్రతి పైలట్ ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు,” అని యుఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి పేర్కొన్నారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. “శత్రు ప్రాంతంలో విడిపోయిన ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం చాలా అరుదైన విషయం. ఇది అసాధారణ సాహసం,” అని ఆయన వ్యాఖ్యానించారు.

Read More
Next Story