
అల్లకల్లోలంగా మారిన ఫ్రాన్స్
పోలీసులతో ఘర్షణకు దిగిన ఆందోళనకారుల, 12 వందల మంది అరెస్ట్, 150 మంది పోలీసులకు గాయాలు
యూరప్ లో శక్తివంతమైన దేశమైన ఫ్రాన్స్ ఉద్యమాలతో అల్లకల్లోలమవుతోంది. పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలలకు నిధుల లేమితో ప్రారంభమైన ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా రూపుదిద్దుకుంది. ఈ చర్యల్లో కనీసం 1200 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, 150 మంది పోలీసులు గాయపడ్డారు.
ఆందోళనకారులు ప్యారిస్ లోని కార్లకు నిప్పు పెట్టి, దుకాణాలను దోచుకుంటున్నారు. దీంతో గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు గోళాలు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. అనేక ఇతర నగరాల్లో నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టడంతో వాటికి నష్టం వాటిల్లింది.
ఈ ఆందోళనకారులకు 2018 లో ప్రారంభమైన ఎల్లో వెస్ట్ ఉద్యమ మద్దతుదారులు , ఉన్నత పాఠశాల విద్యార్థులు, కార్మిక సంఘాల సభ్యులు తోడు అయ్యారు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ అశాంతిని హింస తీవ్రతరం కావడంగా అభివర్ణించింది. ముసుగులు ధరించిన గుంపులు దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్సెయిల్, రెన్నెస్, టౌలౌస్ తో సహ పలు నగరాల్లో ప్రదర్శనలు కొనసాగాయి.
ఘర్షణలు, దోపిడీలు..
పారిస్ లోని ప్లేస్ డీ లా రిపబ్లిక్ పరిసరాల్లో సాయంత్రం వరకు ఘర్షణలు కొనసాగాయి. అక్కడ నిరసనకారులు పోలీసులపై బాణాసంచా, రాళ్లు, ఇతర వస్తువులను విసిరారు. వాహనాలకు, చెత్తబుట్టలకు నిప్పు పెట్టారు. వీధులపై దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. అనేక దుకాణాలను దోచుకున్నారు. పోలీసులు కొందరు నిరసనకారులపై లాఠీలతో కూడా దాడులకు దిగారు.
రాజధానిలో జరిగిన ప్రధాన ప్రదర్శన మధ్యాహ్నం పూట చాలావరకూ శాంతియుతంగానే కొనసాగింది. వాయువ్య పారిస్ వైపు కదులుతున్నప్పుడూ చాలామంది ప్రదర్శనకారులు జెండాలను పట్టుకున్నారు. జాతీయ గీతం పాడారు. సంగీత వాయిద్యాలను వాయించారు. కొంతమంది యువ నిరసనకారులు తాము శాంతివాదులమని, పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ ఏమీ జరగడం లేదని బీబీసీకి చెప్పారు.
అగ్ని ప్రమాదాలు..
ఈ అశాంతి దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. లియోన్ లోని పర్యాటక కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించగా, దీనిని మేయర్ గ్రెగోరీ డూసెట్ నగరానికి ఒక విషాదం అని అభివర్ణించారు.
లిమోజెస్ లో టౌన్ హాల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా దాని పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. మార్సెయిల్ లో నిరసనకారులు కొద్దిసేపు సిటీ హాల్ లో ప్రవేశించడంతో దుకాణాలు, ఒక మున్సిపల్ పోలీస్ స్టేషన్ దెబ్బతిన్నాయి.
‘‘ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని మార్సెయిల్ మేయర్ బెనోయిట్ పాయన్ స్థానిక టీవీతో చెప్పారు. సిటీ హాల్ లోని నష్టాన్ని పరిమితమైనదిగా అభివర్ణించారు.
రెన్నెస్, టౌలౌస్, మౌంట్ పెలియర్, గ్రెనోబుల్ వంటి నగరాల్లో ముసుగులు ధరించిన గుంపులు హింసకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది. అవిగ్నాన్, పా, వాలెన్స్ ఇతర ప్రాంతాలలో కూడా భవనాలకు నష్టం వాటిలినట్లు తేలింది. పారిస్ లో బట్టలు, ఆహార దుకాణాలపై దాడులు జరగ్గా, లిల్లెలోని ఒక ఆపిల్ స్టోర్ లోకి చొరబడి దానిని ఖాళీ చేశారు.
పాఠశాల సమస్యలు..
సెకండరీ పాఠశాలల్లో సిబ్బంది కొరత, క్షీణిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులలో నెలకున్న ఆగ్రహం నేపథ్యంలో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ మధ్య నుంచి విద్యార్థి సంఘాలు పాఠశాలలను దిగ్బంధించగా, యూనియన్లు, ఇతర బృందాలు కూడా వారి ప్రచారంలో చేరాయి.
‘‘అధిక వేతనాలు, పెన్షన్లు, తక్కువ ధరలు, ప్రజల అవసరాలకు తగిన ప్రజా సేవలకు రక్షణ’’ కల్పించాలని డిమాండ్ చేస్తూ, శనివారం నాటి ప్రదర్శనలకు సీజీటీ యూనియన్ మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని అది అంచనా వేసింది.
చాలామంది నిరసనకారులు 2018 ఉద్యమంతో ముడిపడి ఉన్న ఫ్లోరోసెంట్ పసుపు రంగు చొక్కాలను కూడా ధరించారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్యమంలో కమ్యూనిస్ట్ శక్తులు, ఇస్లామిక్ శక్తులు, కొన్ని ఎన్జీఓలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంతార్జాతీయ కథనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ ఉత్తర ఆఫ్రికాలో కాలనీలు ఏర్పాటు చేసుకుని పాలించే సమయంలో అక్కడ ఉన్న లక్షలాది ఇస్లామిస్టులను వారి అవసరార్థం ప్యారిస్ కు రప్పించుకుంది. ఇప్పుడే వారే ఫ్రాన్స్ లో భీభత్సం సృష్టిస్తున్నారు.
మాక్రాన్ శపథం...
ప్రభుత్వ భవనాలు, వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడిన వారిపై విచారణ జరుపుతామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు. మరో వైపు మూడు వేల మంది టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ ఆందోళనలు మాత్రం ఆగడం లేదు.
Next Story

