ఉద్యోగాలలో కోతలు విధించబోతున్న బీబీసీ
x

ఉద్యోగాలలో కోతలు విధించబోతున్న బీబీసీ

577 మిలియన్ పౌండ్లను ఆదా చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు


రాబోయో రెండేళ్ల బీబీసీ నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక వేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తమ వార్షిక బడ్జెట్ లో పది శాతాన్ని అంటే 500 మిలియన్ పౌండ్లు లేదా 677 మిలియన్ డాలర్లు ఆదా చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉద్యోగ కోతలు బీబీసీలో గత దశాబ్దంలో జరిగిన అతిపెద్దవని తెలుస్తోంది.

"ఇది నిజమైన అనిశ్చితిని సృష్టిస్తుందని నాకు తెలుసు, కానీ మేము సవాలు గురించి బహిరంగంగా ఉండాలనుకున్నాము’’ అని తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి తల్ఫాన్ డేవిస్ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో చెప్పారు. ద్రవ్యోల్బణం, లైసెన్స్ ఫీజు, వాణిజ్య ఆదాయంపై ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుదుపుల కారణంగా తగ్గింపులు జరిగాయని డేవిస్ చెప్పారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో బీబీసీ 'గణనీయమైన ఆర్థిక ఒత్తిళ్లను" ఎదుర్కొంది. 2029 నాటికి దాని బడ్జెట్ లో పదో వంతు తగ్గించాలని కోరుకుంటోందని బీబీసీ తెలిపింది. ఏప్రిల్ 1, 2027 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ కోతలు విధించాలని నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెలలో గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాట్ బ్రిటిన్ సంస్థ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలలో కోత విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతకుముందు ట్రంప్ తన పై బీబీసీ నిరాధార వార్తలు రాసినట్లు ఆరోపిస్తూ ఆ సంస్థపై పది బిలియన్ డాలర్ల దావా వేశారు. క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో టీమ్ డెవీ, వార్తల విభాగం అధిపతి డెబోరా టర్నెస్ ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారని ఆరోపణలు రావడంతో వారు రాజీనామా చేశారు.
బీబీసీకి యూకేలో మంచి ఆదరణ ఉంది. ఈ సంస్థకు వార్షిక లైసెన్స్ రూపంలో నిధులు సమకూరుతాయి. ఈ రుసుమును ఇటీవల 180 పౌండ్లకు పెంచారు. దీనిపై దేశంలో విమర్శలు చెలరేగాయి.
బ్రిటన్ లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ సంస్థకు వేరే రూపాల్లో నిధులు సమకూరుస్తామని హమీ ఇచ్చింది. బీబీసీ 1922 లో సమాచారం, విద్య వినోదం' కోసం రేడియో సేవల కోసం స్థాపించారు.
ఇది ఇప్పుడు 15 యూకే జాతీయ ప్రాంతీయ టెలివిజన్ ఛానెల్లు, అనేక అంతర్జాతీయ ఛానెల్లు, 10 జాతీయ రేడియో స్టేషన్లు, డజన్ల కొద్దీ స్థానిక రేడియో స్టేషన్లు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వరల్డ్ సర్వీస్ రేడియో ప్రీమింగ్ సేవతో సహా విస్తృతమైన డిజిటల్ అవుట్పుట్ను నిర్వహిస్తోంది.
Read More
Next Story