భవిష్యత్తు క్వాంటమ్ దే.. SRM వర్సిటీలో నవశకం ప్రారంభం
x
అమరావతిలోని ఎస్సార్ఎం యూనివర్శిటీలో క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

భవిష్యత్తు క్వాంటమ్ దే.. SRM వర్సిటీలో నవశకం ప్రారంభం

అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం (SRM) వర్సిటీ వేదికగా గన్నవరం మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన 1S, 1Q క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ఆయన జాతికి అంకితం చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాంకేతిక విప్లవానికి వేదికైంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన 'క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ'ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం (SRM) వర్సిటీ వేదికగా గన్నవరం మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన 1S, 1Q క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఎస్సార్ఎం యూనివర్శిటీ చైర్మన్ సత్యనారాయణన్, ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ సెంటర్ ను ఆవిష్కరించారు.

ఇది కేవలం మౌలిక సదుపాయం కాదు.. ఒక ఎకో సిస్టమ్!
సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ, ఇది కేవలం భవనాలు లేదా యంత్రాలకు సంబంధించిన మౌలిక సదుపాయం (Infrastructure) కాదని, భవిష్యత్తు తరాలకు అవసరమైన ఒక పరిపూర్ణ ఎకో సిస్టమ్ (Ecosystem) అని స్పష్టం చేశారు.
"క్వాంటం టెక్నాలజీ అనేది కేవలం ఇంజనీరింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రతి రంగానికి ఒక అనివార్యమైన అంశం (Essential Thing). రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచాన్ని శాసించబోతోంది." అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామన్నారు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దానిని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటం మౌలిక సదుపాయాలతో భవిష్యత్తును నిర్మిస్తున్నామని అన్నారు. ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్ లాంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉందన్నారు. క్లైమేట్ మోడలింగ్ లాంటి అంశాలను చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. క్రయోజనిక్స్, ఫ్యాబ్రికేషన్, యాంప్లిఫైడ్ రీసెర్చ్‌లలో విస్తృతంగా ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

తొలి క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారు చేయాలన్నదే లక్ష్యం: ఎల్‌.వి. సుబ్రమణ్యం

అమరావతిలో కంపెనీ ఏర్పాటుకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇచ్చారని క్యూబిట్‌ఫోర్స్‌ సీఈవో ఎల్‌. వెంకట సుబ్రమణ్యం అన్నారు. దేశంలోనే తొలి క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారు చేయాలన్నదే లక్ష్యమని చెప్పారు. నాలుగు నెలల్లోనే క్వాంటం బెడ్‌లు తయారు చేయగలమని అస్సలు ఊహించలేదు’’ అని అన్నారు.

క్వాంటమ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు:పి సత్యనారాయణన్

యూనివర్శిటీ ప్రో-చాన్సలర్ పి సత్యనారాయణన్ ఈ సందర్బంగా ప్రసంగిస్తూ క్వాంటమ్ టెక్నాలజీ ఎలా విద్యార్జులకు, పరిశోధకులకు, పరిశ్రమలకు ఎలా గొప్పవరం కాబోతున్నదో వివరించారు. క్వాంటమ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన అన్నారు.ఈ రంగానికి త్వరలో 8.40లక్షల క్వాంటమ్ సాంకేతిక నిపుణులు అవసరమవుతరాని, ప్రస్తుతం కేవలం 35 వేల మంది మాత్రమే అందుబాటులోఉన్నారని ఆయన చెప్పారు. " ప్రస్తుతం 3.5 బిలియన్ డాలర్లు విలువే ఉన్నా త్వరంలో క్వాంటమ్ టెక్నాలజీ బిజినెస్ 75 బిలియన్ డాలర్ల చేరుకోనుంది. ఇది ఇన్ ఫ్రా స్ట్రక్చర్ గా మొదలు అవుతన్నా, తొందరలోనే ఇది ఒక ఎకోసిస్టమ్ గా మారుతుంది. విద్యార్థులకు, పరిశోధకులకు, ఇంజనీర్లకు మార్గదర్శకంగా మారుతుంది," అని సత్యనారాయణన్ అన్నారు.

దేశంలోనే ప్రథమం: క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది.
భారీ ఉపాధి అవకాశాలు: వచ్చే దశాబ్ద కాలంలో ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 8.40 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక వృద్ధి: ప్రస్తుతం క్వాంటం రంగం మార్కెట్ విలువ కేవలం 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉందని, ఇది త్వరలోనే 70 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

ప్రముఖుల భాగస్వామ్యం: ఈ ప్రాజెక్టుకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సహకారం అందించగా, నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులకు, పరిశోధకులకు పిలుపు
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్‌గా వీక్షించారు. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు (Research) చేసే వారికి, స్టార్టప్‌లకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, రీసెర్చర్లుగా ఎదగాలని, ఉద్యోగ ప్రయత్నాల్లో క్వాంటం నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ చొరవతో అమరావతి గ్లోబల్ టెక్ హబ్‌గా మారడానికి మరో అడుగు ముందుకు వేసిందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
Read More
Next Story