దేశంలో ఈ మంత్రులు నైతిక బాధ్యత తీసుకున్నారు...
x
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో యువత.

దేశంలో ఈ మంత్రులు నైతిక బాధ్యత తీసుకున్నారు...

నాడు నైతిక బాధ్యత వహించి పదవులు త్యాగం చేసిన మంత్రులు ఉన్నారు. నేడు అటువంటి వారు కనిపించడం లేదు.


కేంద్రంలో పాలనా వైఫల్యం లేదా నైతిక బాధ్యత స్వీకరిస్తూ రాజీనామా చేసిన మంత్రులు చాలా అరుదు. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా నెహ్రూ హయాం, తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కనిపిస్తాయి. స్పష్టంగా ‘పాలనలో వైఫల్యం’ లేదా నైతిక బాధ్యత అంగీకరిస్తూ రాజీనామా చేసిన ప్రధాన వివరాలు ఇవి.

మంత్రి

సంవత్సరం

పదవి

ప్రభుత్వం / పార్టీ

కారణం

ప్రస్తుత స్థితి

లాల్ బహదూర్ శాస్త్రి

1956

రైల్వే మంత్రి

నెహ్రూ ప్రభుత్వం (కాంగ్రెస్)

అరియలూర్ రైలు ప్రమాదం (144 మంది మృతి)

1966లో మరణం

టి.టి. కృష్ణమాచారి

1958

ఆర్థిక మంత్రి

నెహ్రూ ప్రభుత్వం (కాంగ్రెస్)

ముంద్రా స్కాండల్ (ఎల్ఐసి పెట్టుబడుల్లో పరిపాలనా లోపం)

1974లో మరణం

వి.కె. కృష్ణ మీనన్

1962

రక్షణ మంత్రి

నెహ్రూ ప్రభుత్వం (కాంగ్రెస్)

ఇండో-చైనా యుద్ధ వైఫల్యం, సైనిక సన్నద్ధత లోపం

1974లో మరణం

మాధవరావ్ సింధియా

1993

పౌర విమానయాన మంత్రి

నరసింహారావు ప్రభుత్వం (కాంగ్రెస్)

ఢిల్లీ విమాన ప్రమాదం (లీజ్ విమానం)

2001లో మరణం

నితీష్ కుమార్

1999

రైల్వే మంత్రి

వాజ్‌పేయి ప్రభుత్వం (సమతా పార్టీ / ఎన్‌డీఏ)

గైసాల్ రైలు ఢీకొనడం (285+ మృతులు)

జీవించి ఉన్నారు (బీహార్ సీఎం)

శివరాజ్ పాటిల్

2008

హోం మంత్రి

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం (కాంగ్రెస్)

26/11 ముంబై ఉగ్రదాడుల్లో భద్రతా లోపాలు

2025 డిసెంబర్‌లో మరణం

ఇవి కాకుండా భారతీయ జనతా పార్టీ (BJP)లో సురేష్ ప్రభు (2017) రైలు ప్రమాదాల తర్వాత రాజీనామా అందించారు. 2017 ఆగస్టులో ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా జరిగిన రైలు ప్రమాదాలు (కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్, కైఫియత్ ఎక్స్‌ప్రెస్) తర్వాత సురేష్ ప్రభు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా అందించారు. ప్రధాని మోదీ ఆ రాజీనామాను వెంటనే అంగీకరించలేదు. తర్వాత సెప్టెంబర్ 2017లో జరిగిన కేబినెట్ రద్దులో ఆయన రైల్వే శాఖ ను మార్చి వాణిజ్య-పరిశ్రమల మంత్రిగా నియమించారు. పియూష్ గోయల్ రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇది నీట్ ఎంట్రెన్స్ పరీక్ష పేపర్ లీక్ కు సంబంధించినది. పరీక్షను రద్దు చేసి మరళా నిర్వహించారు. అయితే కొత్తగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం చేపట్టి ఆయన రాజీనామా చేయించే వరకు తీసుకొచ్చింది. ఇది జెన్ జీ ఉద్యమంగా మారటంతో ప్రభుత్వం భయంతో ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించింది తప్ప నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయలేదు. రాజీనామాకు ముందు విద్యార్థి, యువజనులు చేసిన ఆందోళన కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వం అణచి వేసేందుకు కొంత బలప్రయోగం చేయించింది.


నైతికతకు రాజీనామా… కుర్చీకి రాజీనామా కాదు...

భారత రాజకీయాల్లో ‘పాలనా వైఫల్యం’ అని ఒప్పుకుని కుర్చీ వదిలిన మంత్రులు అరుదు. ఆ అరుదైన జాబితాలో మొదటి పేరు లాల్ బహదూర్ శాస్త్రిది. 1956లో అరియలూర్ రైలు ప్రమాదంలో 140కి పైగా మంది మరణించినప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న శాస్త్రి రెండవసారి రాజీనామా అందించారు. నెహ్రూ మొదటి సారి తిరస్కరించినా, రెండోసారి అంగీకరించాల్సి వచ్చింది. ఆ రాజీనామా శాస్త్రిని దేశంలో నైతిక బలం ఉన్న నేతగా నిలిపింది. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు.

1958లో టి.టి. కృష్ణమాచారి ముంద్రా స్కాండల్‌లో పరిపాలనా బాధ్యత తీసుకుని ఆర్థిక మంత్రి పదవి వదిలారు. హరిదాస్ ముంద్రా అనే కలకత్తా వ్యాపారి (స్టాక్ మార్కెట్ స్పెక్యులేటర్) తన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీల షేర్లను ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తో కొనిపించాడు. LIC దాదాపు రూ. 1.24 కోట్లు (అప్పటి విలువలో పెద్ద మొత్తం) ముంద్రా నియంత్రణలో ఉన్న ఆరు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టింది. (Richardson & Cruddas, Jessops, Smith Stanistreet, Osler Lamps, Angelo Brothers, British India Corporation.) ఈ పెట్టుబడి LIC పెట్టుబడి కమిటీ సలహా లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి జరిగింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు షేర్లు కొన్నారు. LICకి పెద్ద నష్టం వచ్చింది.

1962లో చైనా యుద్ధ వైఫల్యం తర్వాత వి.కె. కృష్ణ మీనన్ రక్షణ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఇవన్నీ నెహ్రూ హయాంలోనే జరిగాయి.

1993లో మాధవరావ్ సింధియా విమాన ప్రమాదం తర్వాత 30 సెకన్లలో రాజీనామా అందించిన సంఘటన ఇంకా చర్చనీయాంశం. 1999లో నితీష్ కుమార్ గైసాల్ రైలు ప్రమాదం తర్వాత ‘నా మనస్సాక్షి అనుమతించడం లేదు’ అని రైల్వే మంత్రి పదవి వదిలారు. ఆయనే ఈ జాబితాలో ఇప్పటికీ జీవించి ఉన్న ఏకైక మంత్రి. 2008లో 26/11 తర్వాత శివరాజ్ పాటిల్ హోం మంత్రి పదవి వదిలి నైతిక బాధ్యత స్వీకరించారు.

ఈ రాజీనామాలు ఒక్క సందేశం ఇస్తాయి. పదవి కంటే బాధ్యత పెద్దది. ఈ రోజుల్లో అలాంటి నైతికత కనిపించడం చాలా తక్కువ. ప్రమాదాలు జరిగినా, స్కాండళ్లు వచ్చినా, కుర్చీని పట్టుకుని ఉండే సంస్కృతి బలపడుతోంది. శాస్త్రి నుంచి నితీష్ వరకు ఆ అరుదైన జాబితా ఇప్పటికీ రాజకీయాలకు ఒక అద్దం పడుతోంది.

Read More
Next Story