కరువు నేలపై వాటర్ బ్లోఅవుట్..
x
సత్యసాయి పుట్టపర్తి జిల్లాకొర్రేవు గ్రామం వద్ద ఎగిసిపడుతున్న నీరు.

కరువు నేలపై వాటర్ బ్లోఅవుట్..

సత్య సాయి జిల్లాలో భూగర్భ జలాలు ఎగజిమ్మడం వెనక కారణమేంటి.


Also Read:నేషనల్ పర్మిట్ కు బ్రేక్: చంద్రబాబు లేఖ ఎఫెక్టేనా!

రాయలసీమ, అనంతపురం జిల్లా అనగానే కరువు పరిస్థితులు కళ్లముందు కనిపిస్తాయి. నీటికి కటకటలాడే స్థితి నుంచి రైతులు ఆనందంగా సేద్యం చేసే సానుకూల వాతావరణం ఏర్పడింది. సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో వాటర్ బ్లోఅవుట్ (Water Blowout) విశేషంగా మారింది. ఈ పరిస్థితులు ఏర్పడడానికి మానవ ప్రయత్నాలకు, సాగునీటి కాలువలే ఉపయోగపడ్డాయని ప్రభుత్వం, రైతులు ఆనందంగా చెబుతున్నారు. ఈ వివరాలేమిటో పరిశీలిద్దాం..

అనంతపురం జిల్లా సత్యసాయి పుట్టపర్తి సమీపంలో బోరు బావి నుంచి భూగర్భ జలాలు 15 అడుగుల ఎత్తు ఎగిసిపడ్డాయి. ఈ దృశ్యం వాటర్ బ్లోఅవుట్ ను తలపించింది. 450 అడుగుల లోతు పాతాళ గంగ ఎగిసిపడడం రైతులను ఆనందానికి గురిచేసింది. అధికారులను విస్మయానికి లోను చేసింది.

రైతు ఆనందం..

గోరంట్ల మండలం కొర్రేవు గ్రామానికి చెందిన రైతు మహాలింగప్ప తన ఎనిమిది ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడానికిబోరు తవ్వకం పనులను ప్రారంభించారు. 100 అడుగుల లోటు బోరు తవ్వకం జరిగే సరికే తడిగా ఉన్న బురదతో కూడిన మట్టి బయటికి వచ్చింది. దీంతో రైతుల కళ్ళలో ఆనందం కనిపించింది. ఇంకొన్ని అడుగుల లోతుకు వెళ్లేసరికి నీరు ఉబికి రావడం ప్రారంభించింది. 450 అడుగుల లోతు బోరు తవ్వకం పూర్తయ్యేసరికి ఎగజిముతున్న నీటి వల్ల మరింత లోతు బోరు వేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. బోరు బండి పక్కకు తీయగానే..
"నీటిని ఆపడం సాధ్యం కాలేదు. ఈ నీరు కనీసం 50 ఎకరాలకు సరిపోతుంది" అని మహాలింగప్ప ఆనంద పారవశ్యానికి లోనయ్యారు.
అధికారులు ఏమంటున్నారంటే..

గోరంట్ల మండలం కొర్రేవు గ్రామం వద్ద బోరు డ్రిల్లింగ్ చేస్తున్న ప్రదేశం నుంచి రిగ్గును పక్కకు తీయగానే ఏకధాటిగా పాతాళ గంగ 15 అడుగుల ఎత్తు వరకు ఎగజిమ్మడంతో రైతులను ఆనందంలో ముంచెత్తింది. ఈ పరిస్థితిపై భూగర్భ జల నిపుణులు కూడా ఆశ్చర్యం చెందారు.
"బోరు వేసినప్పుడు మోటారు లేకుండానే నీరు బయటికి రావడాన్ని ఆర్టియన్ బావి( Artesian Well) పిలుస్తారని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. భూగర్భంలో ఉండే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కూడా నీరు ఎగజిమ్మడానికి ఆస్కారం ఉందని కూడా చెబుతున్నారు. హైడ్రో స్టాటిక్ ప్రెజర్ ( hydroస్టాటిక్ pressure) వల్ల భూమి లోపల ఉండే అభేద్యమైన రాతి పొరల మధ్య నీరు చిక్కుకున్నప్పుడు విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.
గోరంట్ల మండలం కొర్రేవు గ్రామ ప్రాంతంలో ఉన్న భూగర్భంలో పగుళ్ళు (fissures) లేదా ఖాళీ ప్రదేశాల్లో నీరు అధికంగా నిల్వ ఉండడం వల్ల ఇలా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుందని విశ్లేషించారు.

మానవ ప్రయత్నం.. హంద్రీనీవా దోహదం

పుట్టపర్తి సత్యసాయి జిల్లా అధికారుల నివేదికల ప్రకారం గతంలో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు 600 నుంచి 800 అడుగుల లోతులో ఉండేవి. తాజా పరిణామాల నేపథ్యంలో భూగర్భ జలాలు పెరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో వంద నుంచి 150 అడుగుల్లోనే నీటి లభ్యత ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ మొత్తంగా పరిశీలిస్తే భూగర్భ జలాలు ఆశాజనకంగానే ఉన్నాయని విషయం స్పష్టం అవుతుంది. మానవ ప్రయత్నానికి తోడుగా హంద్రీ,నీవా కాలువ వల్ల భూగర్భ జలాలు పెరగడానికి ఆస్కారం కల్పించిందని నిర్ధారించారు. హంద్రీ,నీవా కాలువల ద్వారా కృష్ణా జలాలు రావడం రావడం, ఈ కాలువ ద్వారా చెరువులు నిండడం వల్ల భూగర్భ జలాల పెరుగుదలకు ఆస్కారం కల్పించినట్లు అంచనా వేస్తున్నారు.

ఆ పనులే ఆదుకున్నాయి...
జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనుల్లో ప్రభుత్వానికి తోడు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేశాయి. చెరువుల్లో పూడికి పనులు చేపట్టడం వల్ల వర్షపు నీరు నిలువడంతో భూగర్భ జలాల చేసేందుకు దోహదపడ్డాయి అని అభిప్రాయపడుతున్నారు.
"రాయలసీమ ప్రాంతంలో ఏప్రిల్ నాటికి సగటు భూగర్భ జల మట్టం సుమారు మీటర్ల లోతులోనీ అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం సభలో స్పష్టం చేశారు.
ఆ లెక్కన ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12.14 మీటర్లు, శ్రీ సత్య సాయి జిల్లాలో 15.38, చిత్తూరు జిల్లాలో 11.07, అన్నమయ్య జిల్లాలో 8.43, వైయస్సార్ కడప జిల్లాలో 9.10, నంద్యాల జిల్లాలో 7.12, కర్నూలు జిల్లాలో 6.65, తిరుపతి జిల్లాలో 5.33 మీటర్లలోనే అందుబాటులో ఉన్నట్లు భూగర్భ జల శాఖ నివేదికల సారాంశం.
రాయలసీమలో ఈ ఏడాది భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నాయి. జల సంరక్షణ పనులతో భూగర్భ జలాలను మరింతగా పెంచుదాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 100 రోజుల కార్యాచరణకు ప్రారంభించారు. ఇప్పటికే జలసంరక్షణలో అన్నమయ్య మదనపల్లె జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వేసవిలో జలసంరక్షణ పనుల కార్యాచరణ అమలు తరువాత రాయలసీమలో మరింత పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Read More
Next Story